Headlines

ఇలాంటి రోజు వస్తుందని కలలో కూడా అనుకోలేదు.. ఎమోష్నలైన శోభిత | Sobhita dhulipala emotional comments about her marriage and naga chaitanya


బాలీవుడ్ సినిమాలతో కెరీర్ ప్రారంభించి ఆతర్వాత తెలుగులో స్టార్ డమ్ సొంతం చేసుకున్న హీరోయిన్ శోభిత దూళిపాళ్ల. ఈ అమ్మడు తెలుగు అమ్మాయే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన మూలాలున్న శోభిత, విశాఖపట్నంలో పుట్టి పెరిగింది. చదువు పూర్తయ్యాక మోడల్ గా కెరీర్ ప్రారంభించింది శోభిత. ఆతర్వాత మోడలింగ్ మొదలు పెట్టింది శోభిత. ఆతర్వాత సినిమాల మీద ఇష్టంతో హీరోయిన్ గా మారిపోయింది. అలాగే ఈ అమ్మడు 2013లో ‘ఫెమినా మిస్ ఇండియా ఎర్త్’ కిరీటాన్ని గెల్చుకుని దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది శోభిత. ఆ తర్వాత బాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తన అందం, అభినయంతో మంచి నటిగానూ గుర్తింపు తెచ్చుకుంది.

Jabardasth Naresh: మొదట్లో రూ.500 ఇచ్చారు.. ఇప్పుడు ఒకొక్క ఎపిసోడ్‌కు నాకు ఇచ్చేది ఎంతంటే

తెలుగులో అడివి శేష్ హీరోగా వచ్చిన ‘గూఢచారి’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది శోభిత. ఆ తర్వాత కూడా పలు సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీసుల్లో నటించి మెప్పించిందీ అందాల తార. ఇదే క్రమంలో టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో పడింది శోభిత. చాలా ఏళ్ల పాటు ప్రేమలో మునిగి తేలిన ఈ జంట రెండేళ్ల క్రితం ఒక్కటయ్యారు. 2024 డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో నాగ చైతన్య- శోభితల వివాహం అత్యంత వైభవంగా జరిగింది. పెళ్లి తర్వాత శోభిత సినిమాలకు గ్యాప్ ఇచ్చింది.

రూ. 65కోట్లు పెడితే.. రూ.10 కోట్లు కూడా రాలేదు.. డిజాస్టర్ దెబ్బకు హీరో రూపాయి కూడా తీసుకోలేదు

కాగా పెళ్లి తర్వాత సినిమాలు బాగా తగ్గించేసిన శోభిత సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శోభిత కొన్ని ఎమోషనల్ కామెంట్స్ చేస్తుంది. ఇలాంటి రోజు వస్తుందని కలలో కూడా అనుకోలేదశోభిత తెలిపింది. పెళ్ళైన వెంటనే నేను సినిమా షూటింగ్ కోసం తమిళనాడు వెళ్లాల్సి వచ్చిందని తెలిపింది శోభిత. కేవలం నెలకొకసారి మాత్రమే చైతూను కలిసేదాన్ని.. ఇద్దరం సినిమా ఫీల్డ్ లో ఉండటం వల్ల లైఫ్ ను బ్యాలెన్స్ చేయడం సవాలుగా మారింది. అయితే కొన్ని నెలలకే కొత్త జీవితానికి అలవాటు పడిపోయాం.. మా వైవాహిక బంధాన్ని మరింత బలంగా మార్చుకున్నాం అని చెప్పుకొచ్చింది శోభిత. చిన్నతనం నుంచి నా పెళ్లి గ్రాండ్ గా జరగాలని కలలు కనేదాన్ని.. అయితే ఈ రాష్ట్రం అబ్బాయిని కాకుండా వేరే రాష్ట్రం అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నా.. ఓ హీరోని పెళ్లి చేసుకుంటా అని అస్సలు అనుకోలేదు. ఓ హీరో నా భర్తగా వస్తాడని అస్సలు ఊహించలేదు. కానీ అదృష్టవశాత్తు అది జరిగింది అంటూ ఆనందం వ్యక్తం చేసింది శోభిత.

ఇవి కూడా చదవండి



ఆ హీరోలతో సినిమాలు చేయడం కష్టం.. నా వల్ల కాదు! ఓపెన్‌గా చెప్పేసిన తేజ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *