Headlines

కాకినాడలో లవ్‌ జీహాద్‌ కలకలం.. ఒకరితో పెళ్లి.. ఆరుగురితో సహజీవనం | Woman Alleges Religious Conversion and Harassment After Marriage, Complains Against Man in Kakinada video tv9d – Viral Videos in Telugu


మొన్న సాదిక్‌ఖాన్‌.. నేడు గౌస్‌ మోహిద్దీన్‌.. కాకినాడలో లవ్‌ జిహాద్‌ కేసులు కలకలం రేపుతున్నాయి. సాదిక్‌ఖాన్‌ అరాచకాలతో ఓ ఫ్యామిలీ బలైతే.. ఇప్పుడు గౌస్‌ మోహిద్దీన్‌ బాధితులు బయటకొచ్చారు. గౌస్ మొహిద్దీన్ అనే వ్యక్తి ప్రేమ, పెళ్లి పేరుతో మతం మార్చి మోసం చేశాడంటూ కాకినాడ ఎస్పీకి ఓ మహిళ ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. కాకినాడ జిల్లాలో లవ్‌ జిహాద్‌ కేసులు పెరుగుతున్నాయి. సాదిక్‌ఖాన్‌ కేసు మరువక ముందే.. గౌస్‌ మొహిద్దీన్‌ కేసు తెరపైకి వచ్చింది. ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ గౌస్‌ మొహిద్దీన్‌ అనే వ్యక్తిపై బాల రమ్యశ్రీ అనే మహిళ కాకినాడ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. జగన్నాధపురానికి చెందిన గౌస్‌ మొహిద్దీన్‌ తనను 8 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని తెలిపింది. ప్రేమ పేరుతో దగ్గరై, పెళ్లి చేసుకున్న తర్వాత.. మతం మార్చి చిత్రహింసలకు గురి చేశాడని కంప్లైంట్‌లో పేర్కొంది. ఒత్తిడి చేసి మతం మారేలా చేశాడని బాధితురాలు ఆరోపించింది. అంతేకాదు.. తనతో పాటు మరో ఐదుగురిని కూడా ఇలాగే మోసం చేసినట్టు ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో లవ్‌ జిహాద్‌ల వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది. ప్రేమ పేరుతో గౌస్‌ మొహిద్దీన్‌ పలువురు యువతులను మోసం చేశాడని బాధితురాలు తెలిపింది. ఒకరికి తెలియకుండా మరొకర్ని ట్రాప్‌ చేసి, వారితో సహజీవనం చేశాడని బాల రమ్యశ్రీ ఆరోపించింది. తనను ముస్లిం సంప్రదాయంలో వివాహం చేసుకున్న తర్వాత వేధింపులకు గురిచేశాడని వెల్లడించింది. ఎన్నోసార్లు తప్పించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ.. తనను.. తమ కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది. గౌస్‌ మోహిద్దీన్‌పై ఇప్పటికే ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో ఆ కేసులో ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నాడని.. ఇదే అదను భావించి తమ తల్లిదండ్రుల దగ్గరకు వచ్చానని బాధితురాలు చెప్పింది. అయితే.. గౌస్‌ మొహిద్దీన్‌ నుంచి తనకు రక్షణ కల్పించి, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాకినాడ ఎస్పీని కోరినట్టు తెలిపింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

“జలం… జీవం – జీవితం! ఆకట్టుకుంటున్న సీఎం చంద్రబాబు పోస్ట్

దుమ్మురేపేలా పవన్‌ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. సీఎం చంద్రబాబు ప్రత్యేక శుభాకాంక్షలు

అమెరికాలో తెలుగు పెళ్లి.. ఆన్‌లైన్‌లోనే పెద్దల ఆశీస్సులు!

వెయ్యి రోజుల పాలన.. ఫ్రీగా ఉల్లిగడ్డల పంపిణీ! వరంగల్‌లో కాంగ్రెస్ నేత వినూత్న సంబరాలు!

Gold Price Today: బంగారం కొనాలనుకునేవారికి ఇదే మంచి ఛాన్స్‌? భారీగా తగ్గిన పసిడి ధర

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *