Headlines

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు! కొత్తగా ఎన్ని పోస్టులు కలిశాయంటే..


నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు! కొత్తగా ఎన్ని పోస్టులు కలిశాయంటే..

హైదరాబాద్, ఆగస్ట్ 20: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) ఉద్యోగార్థులకు కీలక ప్రకటన విడుదల చేసింది. జులైలో ప్రకటించిన CEN No. 04/2026 నోటిఫికేషన్‌కు సంబంధించి ఖాళీల సంఖ్యను పెంచింది. గతంలో ప్రకటించిన 3,993 పోస్టులకు అదనంగా 36 ఖాళీలను చేర్చింది. దీంతో మొత్తం ఖాళీల సంఖ్య 4,029కు చేరింది. తాజా సవరణలో భాగంగా 35 కెమికల్‌ అండ్ మెటలార్జికల్ అసిస్టెంట్ (CMA) పోస్టులను కొత్తగా చేర్చారు. అలాగే RRB సికింద్రాబాద్ జోన్‌లో జూనియర్ ఇంజినీర్/ఎలక్ట్రికల్/టీఆర్‌ఎస్ విభాగంలో ఒక అదనపు పోస్టును చేర్చినట్లు RRB వెల్లడించింది. దీంతో ఈ నోటిఫికేషన్ ద్వారా రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు అదనపు అవకాశాలు లభించనున్నాయి.

కొత్తగా చేర్చిన CMA పోస్టులకు ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో కనీసం 45 శాతం మార్కులతో B.Sc డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. CMA పోస్టులకు ప్రారంభ వేతనం రూ.35,400గా ఉంది. 2027 జనవరి నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తించే అవకాశం ఉంది.

మొత్తంగా CEN No. 04/2026 కింద గతంలో ఉన్న 3,993 ఖాళీలకు మరో 36 పోస్టులు జోడించడంతో మొత్తం సంఖ్య 4,029కు పెరిగింది. కొత్తగా CMA పోస్టులు చేరడంతో సంబంధిత విద్యార్హతలు ఉన్న అభ్యర్థులు కూడా ఈ రిక్రూట్‌మెంట్‌పై దృష్టి పెట్టవచ్చు. అభ్యర్థులు RRB అధికారిక నోటిఫికేషన్‌లో పేర్కొన్న విద్యార్హతలు, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, దరఖాస్తు తేదీలు తదితర వివరాలను పూర్తిగా పరిశీలించి తదుపరి చర్యలు నిర్ణయం తీసుకోవల్సి ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *