వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని కలుపుకోవడానికి అద్భుతంగా సరిపోయే ఈ కమ్మని బీరకాయ కొబ్బరి వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: అర కిలో తాజా బీరకాయలు, ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఆవాలు, రెండు ఎండుమిర్చి, రెండు పచ్చిమిర్చి, ఒక చిన్న ఉల్లిపాయ, కచ్చాపచ్చాగా పట్టిన పచ్చి కొబ్బరి తురుము రెండు టేబుల్ స్పూన్లు, కారం, ఉప్పు మరియు నూనె.