Headlines

ముందు బాబాయ్.. ఇప్పుడు అబ్బాయ్ వరుస సర్జరీలు | Nandamuri Heroes’ Injuries: Will NBK111 and Dragon Release Dates Change video – Entertainment Videos in Telugu


ముందు బాబాయ్.. ఇప్పుడు అబ్బాయ్.. గాయాలు వేర్వేరైనా సర్జరీలు మాత్రం కామన్ అయిపోయాయి. బాలయ్య ఇంకా కోలుకోకముందే.. ఎన్టీఆర్ కూడా సర్జరీ చేయించుకున్నారు. అయితే వీళ్ల శస్త్రచికిత్సల కారణంగా సెట్స్ మీదున్న సినిమాల పరిస్థితి ఏంటి…? నందమూరి హీరోల గాయాల ప్రభావం రిలీజ్ డేట్స్‌పై పడబోతుందా..? NBK111, డ్రాగన్ డేట్స్‌లో ఏమైనా మార్పులు జరగబోతున్నాయా..? జూనియర్ ఎన్టీఆర్ కూడా సర్జరీ వైపు వెళ్లడంతో అభిమానులు కంగారు పడుతున్నారు. అయితే ఆయనకేం కాలేదు బాగానే ఉన్నారు.. గాయం పెద్దది కాకుండా వైద్యుల సలహా మేరకే సర్జరీ చేయించుకుంటున్నారని ఎన్టీఆర్ టీం చెప్తున్న మాట. గాయం కారణంగా ఇప్పటికే మూడు వారాలుగా డ్రాగన్ షూట్ ఆగింది.. సర్జరీ కాబట్టి కనీసం మరో రెండు నెలలు తారక్ కెమెరా ముందుకొచ్చే అవకాశమే లేదు. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న డ్రాగన్ షూట్ మొన్నటి వరకు నాన్ స్టాప్‌గా జరిగింది. ముందు 2026లోనే రిలీజ్ అనుకున్నా.. 2027, జూన్ 11కి వాయిదా వేసారు మేకర్స్. అయితే ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే అప్పటికైనా సినిమా రెడీ అవుతుందా అనేది అనుమానమే. పైగా ఇది 2 పార్ట్స్ సినిమా అంటున్నారు. మరోవైపు బాలయ్య గాయం గోపీచంద్ మలినేని సినిమాపై తీవ్రప్రభావం చూపిస్తుంది. కాకినాడ పోర్టులో షూట్ చేస్తున్నపుడు బాలయ్య మోకాలికి పెద్ద గాయమే అయింది. ఆయనకు త్వరగా తగ్గాలని ప్రత్యేక పూజలు కూడా చేయించారు గోపీచంద్. ముందు 2026 దసరాకే NBK111 రిలీజ్ ప్లాన్ చేసినా పరిస్థితులు చూస్తుంటే 2027 సంక్రాంతికి కూడా రావడం కష్టమే అనిపిస్తుంది. ఇక కొరటాల సినిమాపైనా బాలయ్య గాయం ఎఫెక్ట్ ఉంది. మొత్తానికి బాబాయ్-అబ్బాయిల గాయాలు రిలీజ్ డేట్స్‌ను మార్చేలా ఉన్నాయిప్పుడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భారత్‌కు నాసా పిలుపు.. చందమామపై ఇల్లు కడదామంటూ ఆహ్వానం

పిల్లలకోసం తల్లి సాహసం.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో!

నడిరోడ్డుపై వింత ఆకారం.. బొమ్మ అనుకొని పట్టుకోగా షాక్‌

ఏటా వెయ్యి కోట్ల గుడ్లు వృథా.. భారత్‌పై ఎన్‌ఈసీసీ సంచలన నివేదిక!

10వ తరగతి అర్హతతో రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 734 ఉద్యోగాలు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *