Headlines

ముక్కు, చెవులు కొత్తగా కుట్టించుకున్నారా? ఇన్ఫెక్షన్లు రాకుండా పాటించాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు! | New Ear or Nose Piercing? Follow These Essential Aftercare Tips to Prevent Infection


ముక్కు, చెవులు కుట్టించుకోవడం మన సాంప్రదాయంలో ఒక భాగం. అయితే, కొత్తగా కుట్టించుకున్న తర్వాత సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇన్ఫెక్షన్లు, వాపు, తీవ్రమైన నొప్పి వచ్చే అవకాశం ఉంది. చెవి లేదా ముక్కు కుట్టించుకున్న తర్వాత ఆ ప్రదేశాన్ని పదే పదే ముట్టుకోకుండా ఉండటం ఎంతో ముఖ్యం. అంతేకాదు.. కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు కూడా తప్పనిసరిగా తీసుకుంటే.. ఆ గాయం త్వరగా మానిపోతుంది..ఆ వివరాల్లోకి వెళితే..

చేతులతో పదే పదే ముట్టుకోకూడదు

కొత్తగా కుట్టించుకున్న తర్వాత చాలామంది దాన్ని పదే పదే తాకడం లేదా తిప్పడం చేస్తుంటారు. మన చేతులపై ఉన్న బ్యాక్టీరియా గాయంలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్‌కు దారితీస్తుంది. కాబట్టి ఆ ప్రాంతాన్ని తాకే ముందు చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం తప్పనిసరి.

శుభ్రపరిచే సరైన విధానం

గాయం త్వరగా మానడానికి శుభ్రత చాలా అవసరం.

ఇవి కూడా చదవండి



సలైన్ వాటర్ / ఉప్పు నీరు: గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి, కాటన్ సహాయంతో కుట్టిన ప్రదేశం చుట్టూ రోజుకు రెండుసార్లు సున్నితంగా తుడవాలి.

ఆంటిసెప్టిక్ లోషన్: వైద్యులు లేదా పియర్సింగ్ నిపుణులు సూచించిన యాంటీబయోటిక్ క్రీమ్ లేదా లోషన్‌ను మాత్రమే ఉపయోగించాలి.

తడి లేకుండా ఆరనివ్వాలి

స్నానం చేసిన తర్వాత లేదా ముఖం కడుక్కున్న తర్వాత కుట్టిన ప్రదేశంలో నీరు ఉండిపోకుండా చూడాలి. తేమ ఎక్కువసేపు ఉంటే ఫంగల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి స్నానం పూర్తి కాగానే శుభ్రమైన, పొడి టిష్యూ లేదా మెత్తటి కాటన్ గుడ్డతో తడి లేకుండా సున్నితంగా తుడవాలి.

ఆభరణాల ఎంపికలో జాగ్రత్తలు

గాయం పూర్తిగా మానే వరకు కనీసం 6 నుండి 8 వారాలు కుట్టించిన రింగ్ లేదా స్టడ్‌ను తీయకూడదు. ప్రారంభంలో బరువైన, వేలాడే ఆభరణాలను అస్సలు ధరించకూడదు. ఇమిటేషన్ లేదా చౌకబారు లోహాల వల్ల అలెర్జీలు రావచ్చు, కాబట్టి బంగారం, వెండి లేదా సర్జికల్ స్టీల్ ఆభరణాలను ఉపయోగించడం సురక్షితం.

దుస్తులు వేసుకునేటప్పుడు అప్రమత్తత

దుస్తులు మార్చుకునేటప్పుడు లేదా తల దువ్వుకునేటప్పుడు చెవి, ముక్కు ఆభరణాలకు దుస్తులు, జుట్టు చిక్కుకోకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ తీవ్రమైన నొప్పి, ఎరుపుదనం లేదా చీము పట్టినట్లు అనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *