భారతీయ రైళ్ల చివరి బోగీ వెనుక భాగంలో పెద్దగా X గుర్తు ముద్రించి ఉండటాన్ని మనం చూస్తుంటాం. ఇది కేవలం ఒక అక్షరం లేదా డిజైన్ మాత్రమే కాదు, రైల్వే భద్రతలో అత్యంత కీలకమైన సంకేతం. రైలు ప్రయాణంలో ఇంజిన్‌తో పాటు అన్ని బోగీలు సరిగ్గా కనెక్ట్ అయి ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి ఈ గుర్తును ఉపయోగిస్తారు. రైలు ఒక స్టేషన్‌ను లేదా సిగ్నల్ పాయింట్‌ను దాటి వెళ్తున్నప్పుడు, చివరి కోచ్‌పై ఉన్న X గుర్తును అక్కడ విధులు నిర్వర్తించే స్టేషన్ మాస్టర్ లేదా రైల్వే సిబ్బంది తప్పనిసరిగా గమనిస్తారు. ఈ గుర్తు కనిపిస్తే, రైలులోని అన్ని బోగీలు ఎక్కడా విడిపోకుండా సురక్షితంగా వచ్చాయని వారు నిర్ధారించుకుంటారు.
ఒకవేళ అసాధారణ పరిస్థితుల వల్ల మధ్యలో ఏదైనా బోగీ లింక్ తెగిపోయి వెనుక ఉండిపోతే, చివరి కోచ్‌పై X గుర్తు కనిపించదు. ఆ గుర్తు లేకపోవడాన్ని గమనించిన వెంటనే రైల్వే సిబ్బంది అప్రమత్తమై, సదరు రూట్లో ఇతర రైళ్ల రాకపోకలను నిలిపివేస్తారు. దీనివల్ల వెనుక నుంచి వచ్చే వేరే రైలు ఢీకొనే ప్రమాదం తప్పుతుంది.
LV బోర్డు, బ్లింకింగ్ లైట్:
కేవలం X గుర్తు మాత్రమే కాకుండా, చివరి బోగీ వెనుక మరికొన్ని భద్రతా సంకేతాలు కూడా ఉంటాయి. X గుర్తుతో పాటు చిన్న రౌండ్ లేదా చతురస్రాకార బోర్డుపై LV అని రాసి ఉంటుంది. LV అంటే లాస్ట్ వెహికల్ అని అర్థం. ఇది సదరు బోగీయే రైలుకు చివరిదని స్పష్టం చేస్తుంది.
ఇవి కూడా చదవండి
రేడియం, ఫ్లాషింగ్ లైట్: రాత్రి వేళల్లో లేదా పొగమంచు ఎక్కువగా ఉన్న సమయంలో X గుర్తు సరిగ్గా కనిపించకపోవచ్చు. అందుకే దీనిని మెరిసే రేడియం పెయింట్‌తో రాస్తారు. దాంతో పాటు చివరి బోగీ కింద భాగంలో ఎరుపు రంగు లైట్ నిరంతరం బ్లింక్ అవుతూ ఉంటుంది. చూశారుగా.. ప్రతిరోజూ మనం చూసే ఈ X గుర్తు వెనుక ఎంతటి కీలకమైన భద్రతా యంత్రాంగం దాగి ఉందో! ప్రయాణికుల రక్షణ కోసం భారతీయ రైల్వేస్ అమలు చేస్తున్న అనేక నియమాల్లో ఇది అత్యంత కీలకమైనది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..