మనీ ప్లాంట్ : మనీ ప్లాంట్ వాస్తు ప్రకారం చాలా మంచిది. ఇంటిలో మనీ ప్లాంట్ ఉండటం వలన అన్ని విధాలుగా కలిసి వస్తుందంట. ముఖ్యంగా వాస్తు ప్రకారం, ఇంటిలో మనీ ప్లాంట్ పెరగడం వలన సంపద పెరగడమే కాకుండా, ఆర్థికంగా కలిసి వస్తుంది. ఇంటిలో సానుకూలత పెరుగుతుంది.
లక్కీ బాంబు : ఇంటిలో లక్కీ బాంబు మొక్క ఉండటం చాలా మంచిది. ఇది ఇంట్లో సిరిసంపదలను కురిపిస్తుందంట. ఎవరి ఇంటిలో అయితే ఈ మొక్క ఉంటుందో, వారికి డబ్బుకు కొదవే ఉండదంట. అందువలన ఈ మొక్క ఇంట్లో ఉండటం చాలా మంచిదని చెబుతున్నారు నిపుణులు.
తులసి మొక్క : ఇంట్లో తులసి మొక్క ఉండటం చాలా మంచిది. ఇది ఇంటిలో సానుకూల శక్తిని పెంచుతుంది, ప్రతికూల శక్తిని తెలిగిస్తుంది. అంతే కాకుండా ఎవరి ఇంటి ముందు అయితే తులసి మొక్క ఉంటుందో, అది వారి ఇంటిలోని వాస్తు దోషాలను తొలిగిస్తుందంట. ఇంటికి అదృష్టాన్ని తీసుకొస్తుందంట.
తమల పాకు మొక్క : తమల పాకు మొక్క ఇంట్లో పెంచుకోవడం చాలా శుభప్రదం. దీనిని కొంత మంది మాత్రమే తమ ఇంటిలో నాటుకుంటారు. కానీ ఇంటిలో తమల పాకు మొక్క నాటుకోవడం వలన నరదిష్టి తొలిగిపోతుంది. ఇది ఇంటిలో సానుకూలతను పెంపొందిస్తుంది. ఆర్థికంగా కలిసి వచ్చేలా చేస్తుంది. ఇది చాలా మంచిదంట.
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు




