Headlines

వెస్టిండీస్ వన్డే సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్ దూరం.. కారణం ఇదే! | India set for rare cricket feat two indian teams could play in two different countries on the same day video – Sports Videos in Telugu


భారత క్రికెట్‌లో ఒక అరుదైన ఘటన చోటుచేసుకోనుంది. వచ్చే అక్టోబర్‌లో భారత్ ఒకేసారి రెండు వేర్వేరు దేశాల్లో వేర్వేరు జట్లతో మ్యాచ్‌లు ఆడేందుకు సిద్ధమవుతోంది. జపాన్ వేదికగా జరగనున్న ప్రతిష్టాత్మక 2026 ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత టీ20 జట్టుకు స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ కారణంగానే అతను వెస్టిండీస్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు దూరమయ్యాడని బీసీసీఐ స్పష్టం చేసింది. ప్రస్తుతం వన్డే జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్న అయ్యర్, దేశానికి గోల్డ్ మెడల్ సాధించిపెట్టే లక్ష్యంతో ఆసియా గేమ్స్ వైపు అడుగులు వేశాడు.
జపాన్‌లోని ఐచి-నాగోయా వేదికగా సెప్టెంబర్ 28 నుంచి ఆసియా క్రీడల పురుషుల క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. అక్టోబర్ 1న సెమీఫైనల్స్, అక్టోబర్ 3న గోల్డ్ మెడల్ కోసం ఫైనల్ మ్యాచ్ జరగనుంది. సరిగ్గా అక్టోబర్ 3నే భారత్-వెస్టిండీస్ మధ్య మూడో వన్డే మ్యాచ్ న్యూ ఛండీగఢ్‌లో జరగనుంది. దీంతో భారత్ గనుక ఫైనల్స్‌కు చేరితే, ఒకే రోజు రెండు భిన్న దేశాల్లో టీమిండియా జట్లు మైదానంలోకి దిగినట్లవుతుంది. సెప్టెంబర్ 22 నాటికే జపాన్ చేరనున్న భారత జట్టు, ఆతిథ్య జపాన్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. ఆసియా క్రీడల్లో పాల్గొంటున్న భారత బృందానికి బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. క్రీడాకారుల కఠిన శ్రమతో దేశానికి పసిడి పతకాలు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాగా, ఈ టోర్నీ కోసం బీసీసీఐ యువ ఆటగాళ్లు, సీనియర్ల కలయికతో అత్యంత బలమైన జట్టును ప్రకటించింది. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ , వైస్‌ కెప్టెన్‌గా తిలక్ వర్మ సారథ్యంలో అభిషేక్ శర్మ, శివమ్ దూబె, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, సంజూ శామ్సన్, ఇషాన్ కిషన్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, వైభవ్ సూర్యవంశీ బరిలోకి దిగుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఒకటే వేట.. లక్షల్లో పంట.. జాలరి వలలో భారీ చేపలు

పగలు అపర భక్తులు.. రాత్రయితే వీళ్ల అసలు స్వరూపం ఇది!

ఘాట్‌రోడ్‌లో తిష్టవేసిన చిరుత.. భయంతో వణికిపోతున్న వాహనదారులు!

ఇంట్లోనుంచి వింత శబ్దాలు.. వెళ్లి చూడగా.. గుండె జారిపోయే ఘటన

క్రికెట్‌ ఆస్ట్రేలియా సంచలన నిర్ణయం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *