Headlines

వైయస్ షర్మిల ఇంట్లో పెళ్లి సందడి.. అమెరికా డాక్టర్‌తో కూతురు అంజలి నిశ్చితార్థం ఖాయం! | YS Sharmilas Daughter Anjali to Marry US Based Doctor Somula Raghuram Reddy


ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. ఆమె కుమార్తె అంజలి వివాహం అమెరికాలో డాక్టర్‌గా స్థిరపడిన సోముల రఘురామిరెడ్డితో నిశ్చయమైంది. ఈ శుభవార్తతో వైయస్సార్ కుటుంబంలో ఉత్సాహ వాతావరణం నెలకొంది. అయితే, ఇంతకీ ఎవరీ ఎవరీ సోముల రఘురామిరెడ్డి? అనేది ఇప్పుడు అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది.

ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల కూతురు అంజలి వివాహం అమెరికాలో స్థిరపడిన డాక్టర్ సోముల రఘురామిరెడ్డితో నిశ్చయమైంది. స్వస్థలం నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం వీరాపురం గ్రామానికి చెందిన సోముల సుబ్బారెడ్డి కుమారుడే ఈ రఘురామిరెడ్డి. ప్రస్తుతం నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం వీరాపురం గ్రామానికి చెందిన సోముల సుబ్బారెడ్డి కుమారుడే రఘురామిరెడ్డి. చిన్నతనంలో నంద్యాలలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో మేనత్త ఇంట్లో ఉంటూ ప్రాథమిక విద్యను అభ్యసించారు. ఆ తర్వాత ఆయన తండ్రి సుబ్బారెడ్డి ఉద్యోగ/వ్యాపార రీత్యా ఇండోనేషియా వెళ్లడం, అక్కడ నుండి కుటుంబ సమేతంగా అమెరికాకు మారడంతో ఆ కుటుంబం అమెరికాలోనే స్థిరపడింది. ప్రస్తుతం రఘురామిరెడ్డి అక్కడ వైద్యుడిగా సేవలందిస్తున్నారు.

అంజలి, రఘురామిరెడ్డిల మధ్య ముందే పరిచయం ఉండటంతో, వీరి వివాహానికి ఇరు కుటుంబాల పెద్దలు సుముఖత వ్యక్తం చేశారు. ఇటీవల అంజలి అమ్మమ్మ వైయస్ విజయమ్మ, తల్లి వైయస్ షర్మిల, తండ్రి బ్రదర్ అనిల్ కుమార్, అంజలి అందరూ కలిసి రఘురామిరెడ్డి కుటుంబసభ్యులతో ముఖాముఖి మాట్లాడారు. ఈ సమావేశంలో సంబంధానికి అందరూ అంగీకరించి, గ్రూప్ ఫోటోలు కూడా తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి



ఇరు కుటుంబాల అంగీకారంతో ఈ నెల 24వ తేదీన హైదరాబాద్‌లోని కొత్వాల్‌గూడ వద్ద ఉన్న ఆంధ్ర కన్వెన్షన్ సెంటర్‌లో నిశ్చితార్థ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

రఘురామిరెడ్డి సొంత ఊరైన వీరాపురం గ్రామంలోనే ఆయన బంధువులు ఇప్పటికీ నివసిస్తున్నారు. ఆయన బాబాయి సుధాకర్ రెడ్డి ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ తరఫున కొత్తపల్లి జెడ్పీటీసీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఈ నెల 22న వీరాపురం గ్రామంలో చిన్నపాటి శుభకార్యం నిర్వహించిన అనంతరం, కుటుంబసభ్యులంతా నిశ్చితార్థం కోసం హైదరాబాద్ పయనం కానున్నారు. వైయస్ షర్మిల కుమార్తె వివాహం తమ ప్రాంత అబ్బాయితో ఖాయం కావడంతో నంద్యాల జిల్లాలో ఈ విషయం ఇప్పుడు ఆసక్తికర చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *