Headlines

హైదరాబాదీలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. ఇక.. మెట్రో, ఆర్టీసీ ప్రయాణం మరింత సులభం! | Hyderabad Metro Common Pass: Telangana Plans One Ticket for Metro and RTC Buses, Daily and Monthly Passes to Be Introduced video tv9d


నగర ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లో మెట్రో రైలు మరియు ఆర్టీసీ బస్సుల్లో ఒకే టికెట్ లేదా పాస్‌తో ప్రయాణించేలా ‘కామన్ పాస్’ విధానాన్ని వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. రసూల్‌పురాలోని మెట్రో రైల్ భవన్‌లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఆయన ఈ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రయాణికుల సౌలభ్యం కోసం రోజువారీ, నెలవారీ పాస్‌లను జారీ చేయాలని సూచించారు. తాము సాంకేతికంగా ఇందుకు పూర్తిగా సిద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు. ఈ సమావేశం అనంతరం సీఎస్ నగరంలో క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు. బేగంపేట నుంచి ప్యారడైజ్ వరకు మెట్రోలో ప్రయాణించి స్టేషన్లలోని వసతులను పరిశీలించారు. పాతబస్తీలో 7.5 కి.మీ మెట్రో కారిడార్ విస్తరణ పనులతో పాటు, నేషనల్‌ హైవే-44పై ప్యారడైజ్ నుంచి డెయిరీ ఫామ్ రోడ్ వరకు నిర్మిస్తున్న 5.40 కి.మీ ఎలివేటెడ్ కారిడార్ పురోగతిని సమీక్షించారు. ప్రాజెక్టులకు అడ్డంకిగా మారిన భూసేకరణ, బేగంపేట విమానాశ్రయం వద్ద సొరంగ మార్గ అనుమతులు, రక్షణ శాఖ భూముల అంశాలపై చర్చించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ ప్రాజెక్టులను అన్ని శాఖల సమన్వయంతో గడువులోగా పూర్తి చేయాలని సీఎస్ స్పష్టం చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

లోను తీసుకున్న వ్యక్తి కట్టలేకపోతే.. అది ఎవరు చెల్లించాలి.. బ్యాంకు రూల్స్‌ ఇవే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *