Headlines

TV9 Sweet Home Expo 2026: హైదరాబాద్‌లో సొంతింటి కల.. మీ బడ్జెట్‌లో ఇల్లు పొందే గోల్డెన్ ఛాన్స్.. ఇవాళే చివరి రోజు.. | TV9 Sweet Home Real Estate Expo Ends Today, Find Budget Homes and Plots at HITEX

TV9 Sweet Home Expo 2026: హైదరాబాద్‌లో సొంతింటి కల.. మీ బడ్జెట్‌లో ఇల్లు పొందే గోల్డెన్ ఛాన్స్.. ఇవాళే చివరి రోజు.. | TV9 Sweet Home Real Estate Expo Ends Today, Find Budget Homes and Plots at HITEX


హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ గత కొన్ని సంవత్సరాలుగా ఊహించని రీతిలో కొత్త శిఖరాలను తాకుతోంది. నగరంలో ఐటీ, ఫైనాన్స్, ఫార్మా, బయోటెక్ రంగాలు వేగంగా విస్తరించడంతో పాటు అనేక ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలు ఇక్కడ తమ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నాయి. దీనికితోడు మెట్రో రైలు, ఎక్స్‌ప్రెస్ వేలు, ఫ్లైఓవర్లు వంటి మౌలిక వసతులు వేగంగా పూర్తి కావడం నగరంలోని భూముల ధరలకు, రియల్ ఎస్టేట్ రంగానికి మరింత గిరాకీని పెంచాయి. ఈ క్రమంలో భాగ్యనగరంలో సరైన ప్రాపర్టీని ఎంచుకుని, సురక్షితమైన ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ చేసుకోవాలనుకునే వారికి TV9 స్వీట్ హోమ్ ఎక్స్‌పో ఒక అద్భుత వేదికగా నిలుస్తోంది.

హైటెక్స్‌లో గ్రాండ్ ఎక్స్‌పో – నేడే లాస్ట్ డే

హైటెక్ సిటీలోని హైటెక్స్ ప్రాంగణంలో అట్టహాసంగా జరుగుతున్న ఈ TV9 స్వీట్ హోమ్ ప్రాపర్టీ ఎక్స్‌పో ఈరోజే (ఆదివారం) చివరి రోజు. మీ బడ్జెట్‌కు తగిన ఇళ్లు, ప్లాట్లు, విల్లాలు, కమర్షియల్ ప్రాపర్టీల వివరాలను ఒకే చోట తెలుసుకునేందుకు నిపుణులు, బిల్డర్లు అందుబాటులో ఉన్నారు. ఈ ఎక్స్‌పో సందర్శించడానికి ప్రవేశం ఉచితం. కాగా సొంతిల్లు కొనుగోలు చేయాలన్నా లేదా భవిష్యత్తు కోసం ఆస్తిపై పెట్టుబడి పెట్టాలన్నా అనుభవజ్ఞులైన నిపుణుల సలహాలు పొందడానికి ఇది సరైన సమయం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హైటెక్స్‌కు చేరుకుని మీ బడ్జెట్‌కు తగిన ఉత్తమమైన ఇన్వెస్ట్‌మెంట్ వివరాలను తెలుసుకోండి.

వీడియో చూడండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *