Headlines

Watch: కాలేజీ కేర్‌టేకర్‌కు కన్నీళ్లు తెప్పించే పని చేసిన విద్యార్థులు.. భావోద్వేగానికి గురిచేసిన వీడియో వైరల్ | Kerala: college student gifted handmade gift to college caretaker emotional video goes viral

Watch: కాలేజీ కేర్‌టేకర్‌కు కన్నీళ్లు తెప్పించే పని చేసిన విద్యార్థులు.. భావోద్వేగానికి గురిచేసిన వీడియో వైరల్ | Kerala: college student gifted handmade gift to college caretaker emotional video goes viral


కేరళలోని ఓ డెంటల్ కళాశాలలో విద్యార్థులు చేసిన చిన్న ప్రేమపూర్వక ప్రయత్నం లక్షలాది మంది హృదయాలను తాకుతోంది. కళాశాల కేర్‌టేకర్‌కు విద్యార్థులు ఇచ్చిన ప్రత్యేక బహుమతి ఆయనను భావోద్వేగానికి గురిచేయగా, ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ హృద్యమైన వీడియోను చూసిన నెటిజన్లు విద్యార్థుల ఆప్యాయతను ప్రశంసిస్తూ భావోద్వేగ వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఈ ఘటన కేరళలోని సెయింట్ గ్రెగోరియోస్ డెంటల్ కాలేజీలో చోటుచేసుకుంది. విద్యార్థిని హరిప్రియ హమేష్ తన సహచరులతో కలిసి కళాశాల కేర్‌టేకర్‌ జానీ చెట్టన్‌కు ఓ ప్రత్యేక సర్‌ప్రైజ్ ఇవ్వాలని నిర్ణయించారు. అందరూ కలిసి ఆయన కోసం చేతితో గీసిన అందమైన చిత్రపటాన్ని సిద్ధం చేసి, చిన్న వేడుక ఏర్పాటు చేసి బహుమతిగా అందించారు. ఈ మధుర క్షణాలను హరిప్రియ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకోగా, వీడియో కొద్ది గంటల్లోనే విపరీతంగా వైరల్ అయింది.

వీడియోలో జానీ చెట్టన్ చిరునవ్వుతో బహుమతిని నెమ్మదిగా విప్పుతూ కనిపించారు. లోపల తన చిత్రపటం కనిపించగానే ఒక్కసారిగా భావోద్వేగానికి లోనై చిరునవ్వుతో విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆ చిత్రపటాన్ని చేతిలో పట్టుకుని విద్యార్థులతో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. ఆ క్షణంలో అందరి ముఖాల్లో కనిపించిన ఆనందం ప్రేక్షకులను కదిలిస్తోంది.

“స్వచ్ఛమైన ఆత్మ” అనే చిన్న క్యాప్షన్‌తో హరిప్రియ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోకు 1.54 లక్షలకు పైగా లైక్‌లు లభించగా, వేలాది మంది నెటిజన్లు స్పందిస్తున్నారు. “ఇలాంటి క్షణాలే జీవితాంతం గుర్తుండిపోతాయి”, “ఒకరి ముఖంలో చిరునవ్వు తీసుకురావడమే నిజమైన ఆనందం”, “జానీ చెట్టన్ ఈ ప్రేమకు అర్హుడు” అంటూ కామెంట్లు చేస్తున్నారు.

చిన్న బహుమతి అయినా, దానిలోని ప్రేమ, గౌరవం, కృతజ్ఞత ఎంత గొప్పదో ఈ వీడియో మరోసారి చాటిచెప్పింది. మనుషుల మధ్య అనుబంధం, ఆప్యాయత, కృతజ్ఞతలకు విలువనిచ్చే ఇలాంటి సంఘటనలు సోషల్ మీడియాలో అరుదుగా కనిపించినా, కోట్లాది మందిని ప్రేరేపించే శక్తి కలిగి ఉంటాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి…

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *