Headlines

Bigg Boss Thanuja: కళ్యాణ్, పవన్ సాయి గురించి ట్రోల్స్.. గట్టిగా ఇచ్చిపడేసిన తనూజ.. | Bigg Boss Fame Tanuja Puttaswamy Gives Strong Counter To Trolls About Kalyan Padala and Pawan Sai

Bigg Boss Thanuja: కళ్యాణ్, పవన్ సాయి గురించి ట్రోల్స్.. గట్టిగా ఇచ్చిపడేసిన తనూజ.. | Bigg Boss Fame Tanuja Puttaswamy Gives Strong Counter To Trolls About Kalyan Padala and Pawan Sai


ముద్ద మందారం సీరియల్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది తనూజ పుట్టస్వామి. ఆ తర్వాత చాలా కాలం పాటు సీరియల్స్ కు దూరంగా ఉన్న తనూజ.. ఇటీవల బిగ్ బాస్ సీజన్ 9లో పాల్గొన్న సంగతితెలిసిందే. ఈ షో ద్వారా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఒకానొక సమయంలో విన్నర్ అవుతుందని అంతా అనుకున్నారు. చివరి నిమిషంలో రన్నర్ అయ్యింది. ఇక బిగ్ బాస్ అనంతరం టీవీలో పలు షోలలో సందడి చేస్తుంది తనూజ. మరోవైపు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా తన గురించి నెట్టింట వస్తున్న ట్రోల్స్ పై గట్టిగానే రియాక్ట్ అయ్యింది తనూజ.

తనూజపై కొందరు వ్యక్తులు కుట్రలు చేస్తాన్నారని.. పవన్ సాయిని దూరం పెట్టారని.. కళ్యాణ్ పడాల వచ్చాకా పవన్ గురించి పట్టించుకోవడం లేదని.. తనూజ చాలా మారిపోయిందంటూ ఇష్టమొచ్చినట్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తనూజ స్పందిస్తూ.. తన గురించి వస్తున్న ట్రోల్స్ పై గట్టిగానే ఆన్సర్ ఇచ్చింది. పనీ పాట లేనివాళ్లు మాత్రమే ఇలా రియాక్ట్ అవుతారని అన్నారు. బిగ్ బాస్ షో అయిపోయి ఏడు నెలలు అయ్యిందని.. ఇంకా ఆ షో గురించి అందులోని విషయాల గురించే ఎందుకు మాట్లాడుకుంటున్నారని అన్నారు.

అవే కామెంట్స్ చేస్తున్నారని.. దయజేసి వాటిని వదిలేయాలని తెలిపింది. షోలో ఫైటింగ్ ఉంటుందని.. షో అయిపోయాక అలా ఉండలేమని అన్నారు. మేము బాగానే ఉన్నాం… మాకు లేని బాధ మీకెందుకో అర్థం కావడం లేదు అని ప్రశ్నించింది. తన గురించి చేస్తున్న కుట్రలు ఏంటో చెప్పాలని.. ఆ కుట్రలంటూ చేసే కామెంట్లను ఆపాలని.. ఖాళీగా ఉంటే ఆశ్రమానికి వెళ్లి మెడిటేషన్ చేసుకోవాలని..మైండ్ సరిగ్గా లేకపోతే ఆసుపత్రికి వెళ్లాలని సూచించింది. తన గురించి వచ్చే ట్రోల్స్, నెగిటివ్ కామెంట్స్ తనకు పంపొద్దని.. వాటిని చూస్తే తాను డిస్ట్రబ్ అవుతానని అన్నారు. ళ్యాణ్‌, నేను బాగానే ఉన్నామని, ఇప్పటికీ మంచి ఫ్రెండ్స్ అని, మా ఇంట్లో అతను తెలుసు, మా మధ్య మంచి రిలేషన్‌ ఉందని చెప్పింది. ప్రతిసారి ఎంఎం, పీఎస్‌ అంటున్నారు. కానీ బిగ్‌ బాస్‌ వెళ్లేందుకు వాళ్లే సపోర్ట్ చేశారని చెప్పుకొచ్చింది.

ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: కేవలం నలుగురు మనుషులు.. ప్రతి సీన్ భయానకం.. ఈఓటీటీలో ఈ థ్రిల్లర్ మూవీ సంచలనం..

తనూజ పోస్ట్..

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ ఇద్దరూ హీరోలకు తల్లిగా అస్సలు నటించను.. సీనియర్ నటి శరణ్య..



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *