మధురిమ.. ఈ పేరు చెబితే గుర్తు పట్టలేరు కానీ.. పై ఫొటో చూస్తే ఇట్టే గుర్తు పడతారు..ఇంకా గుర్తుకు రాలేదా? అయితే రవితేజ హీరోగా నటించిన విక్రమార్కుడు సినిమా చూశారా? అందులో రాజీవ్ కనకాల భార్యగా నటించింది ఈమెనే. ఆర్ నారాయణ మూర్తి దర్శకత్వంలో వచ్చిన దళం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది మధురిమ. ఆ తర్వాత విక్రమార్కుడుతో పాటు ‘నరసింహనాయుడు’, ‘ఫ్యామిలీ సర్కస్’, ‘ప్రేమతో రా’ ‘తొలివలపు’, వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించాచారు. కేవలం సినిమాల్లోనే కాదు బుల్లితెరపైనా సత్తా చాటింది మధురిమ. పలు సూపర్ హిట్ సీరియల్స్ లో నటించి ఆడియెన్స్ కు చేరువయ్యింది. అన్నట్లు మధురిమ ఒక్కటే కాదు ఆమె భర్త కూడా ప్రముఖ నటుడే. పేరు నవీన్ ఒలేటి. పేరు చెబితే గుర్తు పట్టలేరు కానీ కింది ఫొటో చూస్తే ఇట్టే అర్థం అవుతుంది ఆయనెవరో. బుల్లితెర , వెండితెరపై ఎన్నో సీరియల్స్.. సినిమాల్లో నటించి మెప్పించారు నవీన్. దాదాపు 100 పైగా తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా విభిన్న పాత్రలు వేశారాయన. ‘ప్రేమంటే ఇదేరా’, ‘తొలివలపు’, ‘నువ్వే నువ్వే’, ‘ప్రేమించుకుందాం రా’, ‘విక్రమార్కుడు’ తదితర సినిమాలు నవీన్ కు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి.
ఇవి కూడా చదవండి
కాగా నవీన్, మధురిమలిద్దరికి విక్రమార్కుడు సినిమా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఈ సినిమాలో మధురిమ రాజీవ్ కనకాల భార్య పాత్రలో కనిపిస్తే.. నవీన్ ఓ సాధారణ కానిస్టేబులో పాత్రలో ఆకట్టుకున్నారు. కాగా వీరిది ప్రేమ వివాహం. ప్రస్తుతం ఈ దంపతులు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ఈ అందమైన జంటకు ముగ్గరు సంతానం. ఇద్దరు అబ్బాయిలు, ఒక అబ్బాయి. అయితే ఈ దంపతుల పెద్ద కుమార్తె మనవి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. గ్లామరస్ ఫొటోలు, వీడియోలతో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇక ప్రైవేట్ సాంగ్స్, షార్ట్ ఫిల్మ్స్ కూడా చేస్తోంది స్టార్ కిడ్. తల్లిదండ్రుల అడుగు జాడల్లోనే నడుస్తూ త్వరలోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది మనవి.
Actress Madhurima
నవీన్- మధురిమల కూతురి లేటెస్ట్ ఫొటోస్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి