Headlines

2026 బాక్సాఫీస్..సైడ్ తీసుకున్న టాప్ స్టార్స్‌ | Why Tollywood’s Biggest Stars Are Missing the Big Screen in 2026 video – Entertainment Videos in Telugu

2026 బాక్సాఫీస్..సైడ్ తీసుకున్న టాప్ స్టార్స్‌ | Why Tollywood’s Biggest Stars Are Missing the Big Screen in 2026 video – Entertainment Videos in Telugu


భారీ అంచనాలు ఉన్న చోట నిరాశ కూడా అదే స్థాయిలో ఉంటుంది. 2026 లో పక్కాగా థియేటర్లలో సందడి చేస్తారని భావించిన అగ్ర హీరోలు ఇప్పుడు ఒక్కొక్కరుగా రేసు నుంచి తప్పుకుంటున్నారు. అసలు ఈ కేలండర్ ఇయర్‌లో బిగ్ స్క్రీన్ సందడి మిస్ అవ్వడానికి కారణాలేంటి? ఎందుకు స్టార్స్ అంతా సైలెంట్ అయిపోయారు? బాలకృష్ణ, నాగార్జున లాంటి సీనియర్ హీరోల నుంచి ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి గ్లోబల్ స్టార్ల వరకు అందరూ ఈ ఏడాది థియేటర్లలో కనిపిస్తారని ఫ్యాన్స్ గట్టిగా నమ్మారు. కానీ రియాలిటీలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ముందు నుంచే ప్లాన్ చేసుకున్నా… షూటింగ్ షెడ్యూల్స్ తారుమారు కావడంతో ఇప్పుడు వీరంతా 2026ను స్కిప్ చేస్తున్నారు. జెట్ స్పీడుతో సినిమాలు చేసే బాలకృష్ణ, అఖండ 2 తరువాత స్లో అయ్యారు. ఆ సినిమా రిజల్ట్ తేడా కొట్టేయటంతో ప్రజెంట్ చేస్తున్న సినిమా విషయంలో కంప్లీట్‌గా యూ టర్న్ తీసుకున్నారు. ఫోక్‌లోర్‌ కాన్సెప్ట్‌ను పక్కన పెట్టి గ్యాంగస్టర్‌ డ్రామా చేస్తున్నారు. ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏడాది రిలీజ్ అవుతుందని భావించినా.. ఇప్పుడు బాలయ్య గాయం కారణంగా రిలీజ్‌ విషయంలో అనుమానాలు మొదలయ్యాయి. నాగ్‌ కూడా వందో సినిమా విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటుండటంతో ఆ మూవీ కూడా ఆలస్యమవుతోంది. ఎన్టీఆర్ నీల్ సినిమా ఈ ఏడాది రిలీజ్ కావాల్సి ఉంది. కానీ రిలీజ్ డేట్‌ విషయంలో షాకింగ్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ ఏడాది జూన్‌లో రావాల్సిన ఈ సినిమాను ఏకంగా ఏడాది ఆలస్యంగా 2027 జూన్ 11న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. మరో వైపు బన్నీ కూడా మరోసారి లాంగ్ బ్రేక్ తీసుకుంటున్నారు పుష్ప 2 రిలీజ్ తరువాత వరుస సినిమాలు చేస్తానని మాటిచ్చినా… గ్లోబల్ ప్రాజెక్ట్‌ రాకాను తలకెత్తుకోవటంతో సినిమా ఆలస్యమవుతోంది. దీంతో ఈ సినిమా కూడా ఈ ఏడాది ఆడియన్స్ ముందుకు వచ్చే పరిస్థితి కనిపించటం లేదు ఇలా స్టార్ హీరోలంతా 2026ను స్కిప్ చేస్తుండటంతో ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వందేభారత్‌ స్లీపర్‌ అదుర్స్‌.. విదేశీ మహిళ ప్రశంసలు

చచ్చిపోతున్నా.. దెయ్యమై నా కుటుంబాన్ని కాపాడుకుంటా!

భూమికి దూరమవుతున్న చంద్రుడు.. ఇక సూర్యగ్రహణాలు ఏర్పడవా!

ఛీ.. అంత లగ్జరీ షిప్‌లో ప్రయాణిస్తూ.. ఏంటి తల్లీ ఈ పాడుపని!

ట్రెండ్‌ మారింది గురూ.. వర్క్‌ ఫ్రం హోమ్‌ కాదు..వర్క్‌ ఫ్రం ట్రాఫిక్‌!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *