Headlines

Hero Yash: టాక్సిక్ డిజాస్టర్‌పై హీరో యష్ ఫస్ట్ రియాక్షన్.. అది వాళ్ల ఇష్టం అంటూ | Hero Yash First Reaction After Toxic Box Office Failure Dubbing Supervisor Reveals Details


కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన టాక్సిక్ సినిమా రీసెంట్ గా విడుదలై ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కేజీఎఫ్, కేజీఎఫ్ 2లాంటి బడా సినిమాల తర్వాత యష్ 4ఏళ్ళు గ్యాప్ తీసుకొని చేసిన సినిమా టాక్సిక్. ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు క్రియేట్ అయ్యాయి. అలాగే ఈ సినిమా పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్స్ సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లాయి. పైగా ఐదుగురు హీరోయిన్స్ , యష్ డబుల్ రోల్ దాంతో ఆడియన్స్ ఈ సినిమాను ఓ రేంజ్ లో ఊహించుకున్నారు. కానీ సినిమా విడుదల తర్వాత సీన్ రివర్స్ అయ్యింది. సినిమా డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. దాంతో సినిమా కలెక్షన్స్ కూడా రోజు రోజుకు పడిపోతూ వచ్చాయి.

ఆ హీరోయిన్‌ను చూస్తే ఎవ్వరికైనా గౌరవం ఇవ్వాలనిపిస్తుంది.. చాలా మంచింది : గుణశేఖర్

మొత్తంగా టాక్సిక్ సినిమా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. అయితే సినిమా రిజల్ట్ పై చిత్రయూనిట్ ఎక్కడా స్పందించలేదు. మొదటి సారి యష్ టాక్సిక్ రిజల్ట్ పై స్పందించారని తెలుస్తుంది. టాక్సిక్ సినిమా డబ్బింగ్ సూపర్వైజర్ జై దేవ్ ఇటీవల యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అలాగే యష్ సినిమా రిజల్ట్ పై చేసిన కామెంట్స్ ను కూడా ఆయన షేర్ చేసుకున్నారు.

BiggBoss 10: అమ్మబాబోయ్.. ఒకొక్కరికి అంత రెమ్యునరేషనా..! అందరికంటే ఎక్కువ ఎవరికో తెలుసా

టాక్సిక్ సినిమా డిజాస్టర్ టాక్ రావడంతో నేను చాలా బాధపడ్డాను అని టాక్సిక్ సినిమా డబ్బింగ్ సూపర్వైజర్ జై దేవ్ తెలిపారు. సినిమా నిరాశపరిస్తుందని అనుకోలేదని.. కానీ సినిమాకు వస్తున్న రిజెల్ట్ చూసి ఎమోషనల్ అయ్యానని ఆయన తెలిపారు. అలాగే తన బాధపడుతున్న సమయంలో యష్ తనకు ఫోన్ చేశారని. ఫోన్ చేసి నువ్వు బాధపడకు అని ఓదార్చారని తెలిపారు. అలాగే బాధపడొద్దు జై దేవ్.. సినిమాల రిజల్ట్ అనేది ప్రేక్షకులు నిర్ణయిస్తారు. అది వాళ్ళ ఇష్టం మనం తర్వాత చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అంటూ నన్ను ఓదార్చారు. కానీ ఆయన మాటల్లో నాకు బాధ కనిపించిందని జై దేవ్ అన్నారు. అలాగే సినిమా మొదలైన దగ్గర నుంచి సినిమాలో చాలా మార్పులు జరిగాయని అవి ప్రేక్షకులకు నచ్చలేదని జై దేవ్ అన్నారు.

ఇవి కూడా చదవండి



BiggBoss10: ఊహించని ట్విస్ట్.. హౌస్ నుంచి ఫస్ట్ ఎలిమినేషన్.. అతను అవుట్.?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *