Headlines

RBI: త్వరలో ఆర్‌బీఐ కొత్త ‘ప్లాస్టిక్ నోట్లు’.. కాగితం నోట్లలా మడతబెట్టొచ్చా? మీ అతిపెద్ద డౌట్‌కు క్లారిటీ..! | RBI Set to Bring New Polymer Note, can it be Folded like Paper note?

RBI: త్వరలో ఆర్‌బీఐ కొత్త ‘ప్లాస్టిక్ నోట్లు’.. కాగితం నోట్లలా మడతబెట్టొచ్చా? మీ అతిపెద్ద డౌట్‌కు క్లారిటీ..! | RBI Set to Bring New Polymer Note, can it be Folded like Paper note?


New Polymer Note: భారత కరెన్సీలో ఒక పెద్ద మార్పు రాబోతోంది. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాగితపు నోట్ల స్థానంలో ప్లాస్టిక్ నోట్లను ప్రవేశపెట్టాలనే తన ప్రణాళికను ప్రకటించింది. ఇందుకోసం ఇప్పటికే టెండర్లను పిలిచారు. ఈ కొత్త ప్లాస్టిక్ నోట్ల గురించి సామాన్య ప్రజల మదిలో అనేక ప్రశ్నలు మెదులుతున్నాయి. ఇవి ప్లాస్టిక్ నోట్లు కాబట్టి, డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డుల వలె దృఢంగా ఉంటాయా? ప్లాస్టిక్ నోట్లను మడవవచ్చా?

ఇది కూడా చదవండి: EPFO: మీ పీఎఫ్‌ ఖాతాలో రూ.5 లక్షలు ఉంటే ఎంత వడ్డీ వస్తుందో తెలుసా?

రిజర్వ్ బ్యాంక్ ప్రస్తుతానికి పైలట్ ప్రాజెక్ట్‌గా రూ.10, రూ.20 నోట్లను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఈ నోట్లకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తే, మిగిలిన నోట్లను కూడా ప్లాస్టిక్ నోట్లుగా మార్చడం జరుగుతుంది. ఈ ప్లాస్టిక్ నోట్లు చాలా మన్నికగా ఉంటాయని ఆర్‌బిఐ తెలిపింది. వాటి చెల్లుబాటు కాలం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ప్లాస్టిక్ నోట్లపై తలెత్తిన ప్రశ్నలకు ఇప్పుడు సమాధానాలు లభించాయి.

ఇవి కూడా చదవండి



ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను మడవవచ్చా?

పాలిమర్ నోట్లు ప్లాస్టిక్‌లా కనిపించినప్పటికీ, అవి డెబిట్, క్రెడిట్ కార్డులంత బలంగా ఉండవు. ఈ నోట్లు చాలా పలుచగా ఉంటాయి. ఫలితంగా ఈ నోట్లను మడవడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రస్తుతం కాగితపు నోట్లను డబ్బు సంచులలో లేదా జేబులలో ఎలాగైతే ఉంచుకుంటారో, అలాగే ప్లాస్టిక్ నోట్లను కూడా మడవవచ్చు. కాగితపు నోట్లకు, ప్లాస్టిక్ నోట్లకు మధ్య ఉండే అతిపెద్ద తేడా ఏమిటంటే, ప్లాస్టిక్ నోట్లను మడిచినప్పుడు వాటిపై ఎలాంటి గుర్తులు పడవు. మడత నుండి నోటును విప్పినప్పుడు, అది ముందులాగే ఉంటుంది.

నోట్ల లెక్కింపు యంత్రాన్ని కూడా మార్చాలా?

పాలిమర్ లేదా ప్లాస్టిక్ నోట్లు సాధారణ కాగితపు నోట్ల కంటే కొద్దిగా భిన్నంగా ఉంటాయి. అందువల్ల, ప్రస్తుత నోట్ల లెక్కింపు యంత్రాలు, నగదు నిర్వహణ యంత్రాలు, ఏటీఎంలను కూడా అప్‌డేట్‌ చేయాల్సి ఉంటుంది.

  • ప్లాస్టిక్ లేదా పాలిమర్ కరెన్సీ నోట్ల వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?
  • ఈ నోట్లు కాగితపు నోట్ల కంటే చాలా మన్నికైనవి.
  • పాలిమర్ కరెన్సీ నోట్లు సాపేక్షంగా తక్కువ మురికిగా ఉంటాయి.
  • ఇది తడిసినా పాడవదు. లాగడం వల్ల చిరిగిపోయే ప్రమాదం తక్కువ.
  • ఈ నోటును నకిలీ చేసే అవకాశం తక్కువ.

ఇది కూడా చదవండి: Business Ideas: రూ. 500 పెట్టుబడితో 8 బిజినెస్ ఐడియాలు.. ఇంట్లో నుంచే నెలకు వేలల్లో సంపాదన!

ఇది కూడా చదవండి: Income Tax Notice: మరణించిన వ్యక్తికి ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నోటీసు.. కోర్టుకు చేరిన పన్ను పంచాయితీ.. కీలక తీర్పు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *