Headlines

మల్లన్న భక్తులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. జస్ట్ రూ.25తో హైదరాబాద్‌ టూ కొమరవెళ్లి ప్రయాణం! | Komuravelli Railway Station Opens: Easier Pilgrimage to Mallanna Temple from Hyderabad

మల్లన్న భక్తులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. జస్ట్ రూ.25తో హైదరాబాద్‌ టూ కొమరవెళ్లి ప్రయాణం! | Komuravelli Railway Station Opens: Easier Pilgrimage to Mallanna Temple from Hyderabad


కొమురవెల్లి మల్లన్న ఆలయానికి మరో కొత్త శోభ వచ్చింది. రూ.6 కోట్ల వ్యయంతో కొమురవెల్లిలో నూతనంగా నిర్మించిన రైల్వేస్టేషన్‌ను కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ప్రారంభించారు. అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా మొదటి టికెట్ కొనుగోలు చేసి, తొలి ప్రయాణికుడిగా ట్రైన్ ఎక్కి గజ్వేల్ వరకు ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇది చారిత్రాత్మక ఘట్టం అన్నారు. రెండేళ్లలోనే రైల్వే స్టేషన్‌ నిర్మాణం పూర్తి చేసుకుని.. ప్రారంభించుకోవడం జరిగిందని గుర్తు చేశారు. కొమురవెల్లి రైల్వే స్టేషన్‌ను మల్లన్న భక్తులకు అంకితం చేస్తున్నామన్నారు. హైదరాబాద్‌ నుంచి కొమరవెళ్లికి వచ్చే భక్తులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని.. కేవలం రూ.25తోనే భక్తులు హైదరాబాద్‌ నుంచి కొమురవెల్లి ఆలయానికి చేరుకోవచ్చని తెలిపారు.

స్టేషన్ ప్రత్యేకతలు..

రూ.6 కోట్ల వ్యయంతో ఈ కొత్త రైల్వే స్టేషన్‌ను కేవలం రెండేళ్లలోనే పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చారు. మనోహరాబాద్ – కొత్తపల్లి నూతన రైల్వే లైన్‌లో, లఖడారం – దుద్దెడ స్టేషన్ల మధ్య ఈ హాల్ట్ స్టేషన్‌ను నిర్మించారు. ఈ రైల్వే స్టేషన్ కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రయాణికుల సౌకర్యార్థం స్టేషన్‌లో 450 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పుతో హై-లెవెల్ ప్లాట్‌ఫారమ్, 5 ప్లాట్‌ఫారమ్ షెల్టర్లను ఏర్పాటు చేశారు. అలాగే స్టేషన్ గోడలపై మల్లన్న స్వామి ప్రాశస్త్యాన్ని, స్థానిక ప్రకృతి అందాలను తెలిపే సుందరమైన చిత్రాలు వేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *