Gold Price: భారతదేశంలో బంగారం కేవలం ఒక లోహం మాత్రమే కాదు.. అది ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉన్న ఒక ఆభరణం. ఇక్కడ, ముఖ్యంగా పండుగలు, పెళ్లిళ్ల సమయంలో బంగారాన్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తారు. అయితే, ప్రపంచంలో 1 తులం (10 గ్రాముల) బంగారం అత్యంత చౌక ధరకు ఎక్కడ దొరుకుతుందో అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? పన్నులు, దిగుమతి సుంకాలు, స్థానిక మార్కెట్ పరిస్థితుల కారణంగా, వివిధ దేశాలలో బంగారం ధరలో భారీ వ్యత్యాసం ఉంటుంది. ప్రస్తుతం మనదేశంలో పసిడి ధరలు ఆల్‌టైమ్ గరిష్ఠాల వద్ద ఊగిసలాడుతున్నాయి. అయితే ప్రపంచంలో కొన్ని దేశాల్లో భారత్ కంటే చాలా తక్కువ ధరకు, పన్నుల భారం లేకుండా శుద్ధమైన బంగారం లభిస్తుందని మీకు తెలుసా?
ఇది కూడా చదవండి: Google Account Recovery: సెల్ఫీ వీడియోతోనే గూగుల్ అకౌంట్ రికవరీ.. పాస్‌వర్డ్ మరిచిపోయినా నో టెన్షన్!
దుబాయ్, హాంకాంగ్, స్విట్జర్లాండ్ వంటి ప్రాంతాలలో పసిడి ధరలు మనదేశంతో పోలిస్తే గణనీయంగా తక్కువగా ఉంటాయి. ప్రపంచంలోనే అత్యంత చౌకగా 1 తులం (10 గ్రాములు) బంగారం లభించే ప్రధాన దేశాల వివరాలు ఇవే!
ఇవి కూడా చదవండి
1. దుబాయ్ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్)
దుబాయ్‌ని “సిటీ ఆఫ్ గోల్డ్” అని ఊరికే అనరు. ప్రపంచంలోనే అత్యంత చౌకగా, స్వచ్ఛమైన బంగారం లభించే ప్రదేశాల్లో దుబాయ్ ప్రథమ స్థానంలో ఉంటుంది. ఎందుకు చౌక ఉంటుందనే డౌన్ మీకు రావచ్చు. ఇక్కడ దిగుమతి సుంకం (Import Duty) చాలా తక్కువగా ఉండటంతో పాటు, పర్యాటకులకు VAT రీఫండ్ సౌకర్యం ఉంటుంది. అలాగే మేకింగ్ ఛార్జీలలో లభించే డిస్కౌంట్లు, పసిడి స్వచ్ఛతలో అంతర్జాతీయ ప్రమాణాలు ఇక్కడ ప్రధాన ఆకర్షణ.
2. హాంకాంగ్ (Hong Kong):
ఆసియా ఖండంలో అత్యంత చౌకగా పసిడి కొనుగోలు చేయడానికి హాంకాంగ్ మరొక అద్భుతమైన మార్కెట్. హాంకాంగ్ వేలాది రకాల వస్తువులపై జీరో-టాక్స్ (పన్ను రహిత) విధానాన్ని అమలు చేస్తుంది. బంగారంపై కూడా ఎలాంటి వ్యాట్ (VAT) లేదా సేల్స్ టాక్స్ ఉండదు. ఇక భారతదేశంతో పోలిస్తే ఇక్కడ 1 తులం బంగారంపై స్పష్టమైన ధర వ్యత్యాసం కనిపిస్తుంది.
3. స్విట్జర్లాండ్ (Switzerland):
యూరప్‌లో అత్యుత్తమ నాణ్యత కలిగిన పసిడి బిస్కట్లు, కాయిన్లు లభించే ప్రధాన కేంద్రం స్విట్జర్లాండ్. ఎందుకంటే ఇక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్ రిఫైనరీలు స్విట్జర్లాండ్‌లోనే ఉన్నాయి. ఇక్కడ వ్యాట్ (VAT) రేట్లు చాలా తక్కువగా ఉండటంతో పాటు, మేకింగ్ ఛార్జీలు కూడా రీజనబుల్‌గా ఉంటాయి.
4. థాయిలాండ్:
తక్కువ బడ్జెట్‌లో బంగారు ఆభరణాలు, ఆకర్షణీయమైన డిజైన్లు కావాలనుకునే వారికి థాయిలాండ్‌లోని బాంకాక్ ఉత్తమ ఎంపిక. ఇక్కడ తక్కువ మేకింగ్ ఛార్జీలు (తయారీ ఖర్చులు), తక్కువ పన్నుల కారణంగా పసిడి ధరలు అందుబాటులో ఉంటాయి.
భారతదేశం vs ఇతర దేశాలలో ఈ వ్యత్యాసం ఎందుకు?
భారతదేశంలో బంగారం ధరలపై దిగుమతి సుంకం (Import Duty), అగ్రికల్చరల్ సెస్‌లతో పాటు 3% జీఎస్టీ (GST) అదనంగా పడుతుంది. కానీ దుబాయ్, హాంకాంగ్ వంటి దేశాల్లో ఈ పన్నుల భారం ఉండకపోవడం వల్లే అక్కడ పసిడి ధరలు భారత్ కంటే తక్కువగా ఉంటాయి.
గమనిక: విదేశాల నుండి భారతదేశానికి బంగారం తీసుకువచ్చేటప్పుడు కస్టమ్స్ నిబంధనలు వర్తిస్తాయి. అందుకే ప్రయాణికులు పరిమితికి మించకుండా తెచ్చుకోవడం మంచిది.
ఇది కూడా చదవండి: Gold and Silver: బంగారం, వెండి కొనాలా వద్దా? శ్రావణ మాసంలో ధర తగ్గుతుందా లేదా పెరుగుతుందా?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి