Headlines

Telangana: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి! | Nizamabad Tragedy: 4 Drowned in Sriram Sagar Project

Telangana: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి! | Nizamabad Tragedy: 4 Drowned in Sriram Sagar Project


నిజామాబాద్‌ జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టును చూసేందుకు వచ్చిన నలుగురు వ్యక్తులు ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయి గల్లంతు అయ్యారు. అయితే బాధితుల కేకలు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రెస్క్యూ టీంతో పాటు హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాల వెలికితీసేందుకు రంగంలోకి దిగారు. ఇప్పటి వరకు ముగ్గురు మృతదేహాలను వెలికి తీశారు. మరో వ్యక్తి మృతదేహం కోసం గజ ఈతగాళ్ల సహాయంతో ముమ్మరంగా గాలిస్తున్నారు.

అయితే మృతులు నిజామాబాద్‌ జిల్లాకు చెందిన కలిమ్‌, నజవత్‌, అజీమ్‌గా గుర్తించారు పోలీసులు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో పర్యాటకులకు అధికారులు కొన్ని కీలక సూచనలు చేశారు. పర్యాటకులు ప్రాజెక్టు దగ్గరకు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *