Headlines

నాకు నువ్వు పాటలు రాయాలి అంటూ ఆ హీరో బెదిరించాడు.. సంచలన విషయం తెలిపిన సుద్దాల అశోక్ తేజ | Tollywood Lyricist Suddala Ashok Teja About Hero MohanBabu

నాకు నువ్వు పాటలు రాయాలి అంటూ ఆ హీరో బెదిరించాడు.. సంచలన విషయం తెలిపిన సుద్దాల అశోక్ తేజ | Tollywood Lyricist Suddala Ashok Teja About Hero MohanBabu


ప్రముఖ గీత రచయిత సుద్దాల అశోక్ తేజ తన సుదీర్ఘ సినీ ప్రస్థానం గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన రచనల వెనుక ఉన్న ప్రేరణల గురించి, అలాగే ఆయన కెరీర్‌లో కీలక పాత్ర పోషించిన ప్రముఖుల గురించి అనేక విషయాలను పంచుకున్నారు.  అలాగే కలెక్షన్ కింగ్ , డైలాగ్ కింగ్ ,మోహన్ బాబు గురించి కూడా పలు విషయాలు తెలిపారు. మోహన్ బాబు గురించి బయట నెలకొన్న ప్రతికూల ప్రచారంపై ప్రస్తావిస్తూ, ఆయన గొప్ప వ్యక్తిత్వాన్ని, సహాయ స్వభావాన్ని అశోక్ తేజ కొనియాడారు. మోహన్ బాబు కలెక్టర్ గారి సినిమా కోసం తనకు అవకాశం ఇవ్వడం తన జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు అని పేర్కొన్నారు. మోహన్ బాబు తనతో సంభాషించిన తీరును గుర్తుచేసుకుంటూ..ఆయన నన్ను బెదిరించి పాటలు రాయించుకున్నారు అని తెలిపారు “నువ్వు మా గురువు గారి పాటలే రాస్తే ఇంటికి వెళ్లిపోయి గుడ్డు పెట్టుకోవాల్సి ఉంటుంది. నా పాటలు రాయ్. నీకు ప్రతి నెలకు పాటలుంటాయి” అంటూ బెదిరించి మరీ పాటలు రాయించారని సరదాగా చెప్పుకొచ్చారు.

ఇది కూడా చదవండి : అప్పుడు తండ్రితో.. ఇప్పుడు కొడుకుతో..! ఆ స్టార్ హీరో సినిమాలో నయన తార.?

కేవలం అవకాశం ఇవ్వడమే కాకుండా, తన ప్రతిభను పరీక్షించారని, కోటి గారి బాణీకి రెండు పల్లవులు రాసి పంపమని మోహన్ బాబు కోరారని తెలిపారు. తాను “దొంగ జాబిలి ఇచ్చిపో పెదవితో జున్ను పాలారమ్” అనే పల్లవిని రాయగా, మోహన్ బాబుకి అది బాగా నచ్చిందని, అందులో వాడిన అక్షర ప్రయోగం ఆయనను ఎంతగానో ఆకట్టుకుందని వెల్లడించారు.

ఇది కూడా చదవండి : ఆ హీరో నైటీ వేసుకోవడానికి వెనకడుగేశాడు.. అందుకే నేనే ఆ పాత్ర చేశా

ఈ సంఘటన తనకు సినీ రంగంలో నిలదొక్కుకోవడానికి ఎంతగానో సహాయపడిందని అశోక్ తేజ అన్నారు. “ఆయన నన్ను కాపాడినాడు. నిజంగా కూడా ఆయన ఆఫర్ ఇయ్యకపోతే నేను ఇంతకాలం ప్రయాణం చేసేవాడిని కాదు” అని కృతజ్ఞతలు తెలిపారు అశోక్ తేజ. మోహన్ బాబుతో పాటు దాసరి నారాయణ రావు, శ్రీహరి వంటి ప్రముఖులు తన కెరీర్‌కు తోడ్పడ్డారని, వారి ప్రోత్సాహం తన ఇన్నేళ్ల ప్రయాణానికి ఆసరాగా నిలిచిందని పేర్కొన్నారు. రాఘవేంద్ర రావు నుంచి రాజమౌళి వరకు అనేక మంది దర్శకులతో కలిసి పని చేసిన అనుభవాలను కూడా ప్రస్తావించారు.

ఇది కూడా చదవండి : అప్పుడు చిన్న పిల్లాడు.. ఇప్పుడు స్టార్ హీరో అయ్యాడు..! అందరం ఒకే కుటుంబంలా ఉండేవాళ్లం

Mohanbabu

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *