Headlines

రోజుకు 45 దాచిపెడితే.. 100 ఏళ్ల వరకు ఏటా 40 వేలు.. ఎల్ఐసీ అద్భుత స్కీమ్ గురించి తెలుసా? | LIC Jeevan Umang Policy: Save Rs 45 perDay and Get Rs 40,000 Annual Income Till Age 100

రోజుకు 45 దాచిపెడితే.. 100 ఏళ్ల వరకు ఏటా 40 వేలు.. ఎల్ఐసీ అద్భుత స్కీమ్ గురించి తెలుసా? | LIC Jeevan Umang Policy: Save Rs 45 perDay and Get Rs 40,000 Annual Income Till Age 100


ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో కొంత భాగాన్ని పొదుపు చేసి, సురక్షితమైన చోట పెట్టుబడి పెట్టాలని అనుకుంటారు. ముఖ్యంగా జీవితాంతం క్రమం తప్పకుండా స్థిరమైన రాబడినిచ్చే పథకాల కోసం వెతుకుతుంటారు. అటువంటి వారి కోసం దేశంలోనే అతిపెద్ద జీవిత బీమా సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒక అద్భుతమైన ప్లాన్‌ను అందిస్తుంది. అదే ఎల్ఐసీ జీవన్ ఉమాంగ్. ఈ పాలసీ ప్రత్యేకం ఏంటంటే.. ఇందులో సురక్షితమైన పెట్టుబడితో పాటు 100 ఏళ్ల వయస్సు వరకు హామీతో కూడిన క్రమబద్ధమైన ఆదాయం లభిస్తుంది.

ఎల్ఐసీ జీవన్ ఉమాంగ్ ఎలా పనిచేస్తుంది?

ఈ ప్లాన్‌లో పాలసీదారులు తమ సౌలభ్యాన్ని బట్టి 15, 20, 25 లేదా 30 సంవత్సరాల ప్రీమియం చెల్లింపు కాలాన్ని ఎంచుకోవచ్చు. రూ.2లక్షల నుంచి ఎంతైన పెట్టుబడి పెట్టొచ్చు. 100 ఏళ్ల వరకు లైఫ్ కవరేజ్ ఉంటుంది. ప్రీమియం చెల్లింపు కాలం పూర్తయిన తర్వాత నుంచి పాలసీదారుడికి ప్రతి సంవత్సరం ప్రాథమిక హామీ మొత్తంలో 8శాతం ఆదాయం గ్యారెంటీగా లభిస్తుంది.
ఒకవేళ పాలసీదారుడు 100 సంవత్సరాల వయస్సు రాకముందే మరణిస్తే, హామీ మొత్తం, బోనస్‌లు నామినీకి అందజేస్తారు. కోరుకుంటే ఈ మొత్తాన్ని ఒకేసారి కాకుండా వాయిదాలలో కూడా పొందవచ్చు.

రోజుకు రూ. 45తో రూ. 40,000 వార్షిక ఆదాయం ఎలా?

ఉదాహరణకు.. 26 సంవత్సరాల వయస్సు ఉన్న ఒక వ్యక్తి రూ.5 లక్షల ప్రాథమిక హామీ మొత్తంతో ఈ పాలసీ తీసుకుని.. 30 సంవత్సరాల ప్రీమియం టర్మ్ ఎంచుకున్నారనుకుందాం..

  • నెలవారీ ప్రీమియం: సుమారుగా రూ. 1,350
  • త్రైమాసిక ప్రీమియం: రూ. 4,100
  • అర్ధ-వార్షిక ప్రీమియం: రూ. 8,112
  • వార్షిక ప్రీమియం: రూ. 16,047
  • మొత్తం చెల్లించే ప్రీమియం: సుమారుగా రూ. 4,81,410.

56 ఏళ్ల వయస్సు నుంచి జాక్‌పాట్..

30 ఏళ్ల ప్రీమియం చెల్లింపు కాలం ముగిసేసరికి పాలసీదారుడి వయస్సు 56 సంవత్సరాలు వస్తుంది. ఆ తర్వాత నుంచి ఎల్ఐసీ ప్రతి సంవత్సరం ప్రాథమిక హామీ మొత్తంలో 8శాతం చొప్పున అంటే ఏడాదికి రూ.40,000 నేరుగా పాలసీదారుడి ఖాతాలో జమ చేస్తుంది. ఈ రూ.40,000 వార్షిక ఆదాయం పాలసీదారుడికి 100 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ప్రతి సంవత్సరం అందుతూనే ఉంటుంది. తక్కువ మొత్తంలో పొదుపు చేస్తూ.. రిటైర్మెంట్ తర్వాత కూడా ఆర్థికంగా ఎవరిపైనా ఆధారపడకుండా ఉండాలనుకునే వారికి ఈ ప్లాన్ బెస్ట్ ఆప్షన్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *