Headlines

ప్రమోషన్స్‌కే వందల కోట్లు… అంత లెక్క తిరిగొస్తుందా..? | Ramayana Sets New Benchmark with rs375 Crore Global Promotions video tv9d – Entertainment Videos in Telugu

ప్రమోషన్స్‌కే వందల కోట్లు… అంత లెక్క తిరిగొస్తుందా..? | Ramayana Sets New Benchmark with rs375 Crore Global Promotions video tv9d – Entertainment Videos in Telugu


పాన్ ఇండియా సినిమాల ప్రమోషన్స్ విషయంలో ఇప్పుడు ఓ కొత్త ట్రెండ్ నడుస్తోంది. కంటెంట్ ఎంత బాగున్నా, దాన్ని జనాల్లోకి తీసుకెళ్లే పబ్లిసిటీకే మేకర్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఈ క్రమంలో నితీష్ తివారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘రామాయణ’ సినిమా ప్రచారానికి సంబంధించి ఓ క్రేజీ అప్‌డేట్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఏకంగా 375 కోట్లతో ఈ మూవీ టీమ్ ప్లాన్ చేసిన గ్లోబల్ ప్రమోషన్ స్ట్రాటజీ చూసి ఇండస్ట్రీ వర్గాలు అవాక్కవుతున్నాయి. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర పాన్ ఇండియా సినిమాల రేంజ్ పెరిగే కొద్దీ వాటి ప్రమోషనల్ బడ్జెట్లు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. సాధారణంగా మన దగ్గర భారీ సినిమాల ప్రచారానికి 20 నుంచి 60 కోట్లు ఖర్చు చేయడం కామన్. కానీ, నితీష్ తివారీ డైరెక్షన్‌లో రణబీర్ కపూర్ హీరోగా వస్తున్న ‘రామాయణ’ ఈ రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేస్తోంది. ఇండియన్ సినీ హిస్టరీలోనే ఎన్నడూ లేని విధంగా ఏకంగా 375 కోట్ల మార్కెటింగ్ బడ్జెట్‌తో సరికొత్త రికార్డ్ సెట్ చేయబోతోంది. ఈ భారీ పబ్లిసిటీ బడ్జెట్‌లో మేజర్ షేర్ ఇంటర్నేషనల్ డిస్ట్రిబ్యూటర్ అయిన సోనీ పిక్చర్స్ భరిస్తుండటం విశేషం. కేవలం గ్లోబల్ ప్రమోషన్స్ కోసమే సోనీ సంస్థ 235 కోట్లు పెట్టుబడిగా పెడుతుండగా.. మేకర్స్ అదనంగా మరో 140 కోట్లు కేటాయించారు. హాలీవుడ్ సినిమాల తరహాలో శాన్ డియాగో కామిక్-కాన్ లాంటి గ్లోబల్ ఈవెంట్లలో రామాయణను గ్రాండ్‌గా ప్రమోట్ చేయడానికి పక్కా స్కెచ్ వేశారు. రామాయణ కంటే ముందు మన సినిమాల ప్రచార బడ్జెట్స్ చూసుకుంటే.. రోబో కార్ బుజ్జి గ్లోబల్ టూర్స్‌తో కల్కి 2898 ఏడీ టీమ్‌ దాదాపు 100 కోట్లు ఖర్చు చేసి ప్రమోషన్‌ బడ్జెట్‌ విషయంలో రెండో ప్లేస్‌లో ఉంది. ఆ తర్వాత ఆస్కార్ క్యాంపెయిన్‌, జపాన్ ప్రమోషన్స్ కోసం ఆర్ఆర్ఆర్ టీమ్‌ 80 కోట్లు, వీఆర్ గేమింగ్ లాంటి వాటి కోసం బాహుబలి-2 టీమ్‌ 60 కోట్లు ఖర్చు చేశాయి. ఇక రజినీకాంత్ 2.0, షారుఖ్ జవాన్ లాంటి సినిమాలు కూడా దాదాపు 50 కోట్లతో బుర్జ్ ఖలీఫా లాంటి ఐకానిక్ ప్లేసెస్‌లో ఈవెంట్స్ చేసి ప్రమోషన్స్‌లో దుమ్ములేపాయి. ఈ నెంబర్స్ చూశాక ప్రచారానికే వందల కోట్లు ఖర్చు చేస్తే వర్కౌట్ అవుతుందా అన్న డౌట్ రాకమానదు. కానీ బాక్సాఫీస్ రికార్డ్స్ చూస్తే ఇది పక్కాగా వర్కౌట్ అవుతోందనే చెప్పాలి. భారీ ప్రమోషన్స్‌తో బజ్ క్రియేట్ చేసిన కల్కి, ఆర్ఆర్ఆర్, జవాన్, కేజీఎఫ్ 2 సినిమాలు వసూళ్ల సునామీ సృష్టించాయి. ఈజీగా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ ఎలా రాబట్టాయి. పబ్లిసిటీకి పెట్టే ఖర్చు మూవీకి సాలిడ్ ఓపెనింగ్స్ తీసుకురావడంతో పాటు గ్లోబల్ రీచ్‌ను పెంచుతోంది. ఇప్పుడు రామాయణ మేకర్స్‌ కూడా ఇదే ఫార్ములాతో బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి రెడీ అవుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Lets Fix Our Food: ఊబకాయంపై యుద్ధం.. ICMR-NIN సంచలన నివేదిక

కెమెరామెన్‌కి బంపరాఫర్‌.. యువకుడిని పెళ్లాడిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు!

బంధువుల మెప్పు కోసం అంత ఖర్చు అవసరమా!

Weather Update: దూసుకొస్తున్న వాయు‘గండం’.. దంచికొట్టనున్న వర్షాలు.. వచ్చే మూడు రోజులు ముసురే

Cyber Crime:పార్శిల్‌ వచ్చింది.. రూ.22 పే చేయమని మెసేస్‌ వచ్చిందా.. అయితే.. బీ అలర్ట్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *