Headlines

రాశిఫలాలు (28 జూలై): ఉద్యోగ, పెళ్లి విషయాల్లో శుభవార్తలు..12 రాశుల వారికి ఇలా.. | Daily Horoscope for July 28, 2026: Career Growth, Financial Gains and Important Predictions for All 12 Zodiac Signs

రాశిఫలాలు (28 జూలై): ఉద్యోగ, పెళ్లి విషయాల్లో శుభవార్తలు..12 రాశుల వారికి ఇలా.. | Daily Horoscope for July 28, 2026: Career Growth, Financial Gains and Important Predictions for All 12 Zodiac Signs


దిన ఫలాలు (జూలై 28, 2026): మేష రాశి వారికి ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా వృద్ధి చెందుతాయి. వృషభ రాశి వారికి ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. సహోద్యోగుల బాధ్యతలను పంచుకోవాల్సి వస్తుంది. మిథున రాశి వారు ఉద్యోగంలో పనితీరుతో అధికారుల్ని ఆకట్టుకుంటారు. వృత్తి, వ్యాపారాలు నల్లేరు మీద బండిలా సాగిపోతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా వృద్ధి చెందుతాయి. కుటుంబపరంగా చిన్నపాటి సమస్యలు ఉండవచ్చు. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరిం చడం మంచిది. బంధువుల నుంచి ఆశించిన శుభ వార్తలు వింటారు. రావలసిన డబ్బు అనుకో కుండా చేతికి అందుతుంది. నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు అందుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆదాయానికి ఇబ్బందేమీ ఉండదు. ముఖ్యమైన వ్యవహారాల్లో కొద్దిగా శ్రమ ఉంటుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. సహోద్యోగుల బాధ్యతలను పంచుకోవాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో కీలక మార్పులు చేపట్టి ఆశించిన ఫలితాల్ని పొందుతారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం వచ్చే అవకాశముంది. బంధు వర్గంలో మంచి పెళ్లి సంబంధం నిశ్చయం అవు తుంది. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామిని సంప్ర దించడం మంచిది. ఆదాయంలో పెరుగుదల కనిపిస్తోంది. కానీ, వృథా ఖర్చులు పెరుగుతాయి.

ఇవి కూడా చదవండి



మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో పనితీరుతో అధికారుల్ని ఆకట్టుకుంటారు. వృత్తి, వ్యాపారాలు నల్లేరు మీద బండిలా సాగిపోతాయి. కుటుంబ జీవితం బాగా హ్యాపీగా సాగిపోతుంది. ఆదాయ వ్యయాలు దాదాపు సమానంగా ఉంటాయి. బంధుమిత్రుల నుంచి ఆర్థిక సహాయం కోసం ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. ఉద్యోగం మారడానికి అవకాశముంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు తొలగిపోతాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగ జీవితం చాలావరకు సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. కుటుంబ పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు తీరిపోయి, మనశ్శాంతి కలుగుతుంది. వ్యయ ప్రయాసలతో గానీ ఏ పనీ ఒక పట్టాన పూర్తి కాదు. ఖర్చులు పెరుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్య ఉంటుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం, ఆదరణ లభిస్తాయి. డాక్టర్లు, లాయర్లు, ఇతర వృత్తుల వారికి రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆర్థిక విషయాల్ని బయటపెట్టకపోవడం శ్రేయస్కరం. ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యం మీద కాస్తంత శ్రద్ద పెట్టడం అవసరం. ఉద్యోగంతో నిమిత్తం లేకుండా అదనపు రాబడి మీద దృష్టి పెడతారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో తప్పకుండా ఆశించిన శుభవార్తలు వింటారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగంలో అధికారులు అతిగా ఉపయోగించుకుంటారు. ఇతరుల బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తుంది. శక్తి సామర్థ్యాలకు గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరిగే అవకాశ ముంది. ఆదాయం మెరుగ్గా ఉంటుంది కానీ, ఖర్చులు, సహాయాలు పెరిగే అవకాశం ఉంది. రావ లసిన డబ్బు అనుకోకుండా చేతికి అందుతుంది. నిరుద్యోగులు సాధారణ ఉద్యోగంతో సరిపెట్టుకో వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్త వింటారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. అధికారులను పనితీరుతో ఆకట్టుకుంటారు. వ్యాపారాల్లో కొత్త ఆలోచనలను ప్రవేశపెట్టి విజయాలు పొందుతారు. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆదాయానికేమీ లోటుండదు. విలాసాల మీద బాగా ఖర్చవుతుంది. ఆశించిన శుభ వార్తలు వింటారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. బంధువుల్లో ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. మంచి పరిచయాలు కలుగుతాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగంలో పనిభారం ఎక్కువగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు కొద్దిపాటి లాభాలతో పురోగమి స్తాయి. ధన సంపాదన నిలకడగా సాగిపోతుంది. సంపాదన పెంచుకోవడానికి మార్గాలు వెతుకు తారు. ఖర్చుల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిది. ముఖ్యమైన వ్యవహా రాలు పెండింగులో పడతాయి. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. శుభవార్తలు అందవచ్చు. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగంలో కొన్ని ఆశించిన సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఒక్క క్షణం తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక విషయాల్లో సమయం బాగా అనుకూలంగా ఉంది. శుభవార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది. ఆదాయం రూపంలో అదృష్టం పడుతుంది. కుటుంబంలో ఒక శుభ పరిణామం చోటు చేసుకుం టుంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. కీలక విషయాల్లో జీవిత భాగస్వామి తోడ్పాటు లభిస్తుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఆశించిన ప్రతిఫలం లభిస్తుంది. డాక్టర్లు, లాయర్ల వంటి వృత్తులవారికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఆదాయానికి లోటుండదు కానీ, అనుకోని ఖర్చులు ఇబ్బంది పెడతాయి. అనవసర సహాయాలు చేయకపోవడం మంచిది. ఒకటి రెండు చిన్నా చితకా సమస్యల నుంచి బయటపడతారు. ఇతరుల వివాదాల్లో జోక్యం చేసుకోవద్దు.మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం జాగ్రత్త. కుటుంబ జీవితం సుఖసంతోషాలతో సాగిపోతుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగంలో అధికారులు ఎక్కువగా ఉపయోగించుకుంటారు. విశ్రాంతి లభించని పరిస్థితి ఏర్పడు తుంది. వృత్తి, వ్యాపారాల్లో కూడా శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. వ్యాపారాల్లో పోటీ దార్ల నుంచి ఒత్తిడి ఉంటుంది. అనేక మార్గాల్లో ధన సంపాదన ఉన్నప్పటికీ, అనవసర ఖర్చులు అధికంగా ఉంటాయి. నిరుద్యోగులు సాధారణ ఉద్యోగంతో సర్దుకుపోవాల్సి వస్తుంది. పెళ్లి ప్రయ త్నాల విషయంలో శుభవార్తలు అందే అవకాశముంది. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగంలో జీతభత్యాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ప్రోత్సాహం ఉంటుంది. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు కనిపిస్తాయి. కుటుంబ పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. కొన్ని ఖర్చులు తగ్గించుకుం టారు. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. దైవ కార్యాల్లో, శుభ కార్యాల్లో పాల్గొంటారు. కొందరు మిత్రుల వల్ల సమస్యల్లో చిక్కుకునే అవకాశముంది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్త వింటారు.

Also Read: గురువు కటాక్షం.. అక్టోబర్ కల్లా వారు ఐశ్వర్యవంతులు కాబోతున్నారు..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *