Headlines

Viral Video: పక్షుల గూటిలో వింత శబ్దాలు.. ఏం జరిగిందో తెలుసా? | 9 Foot Rat Snake Rescued from Bird Enclosure Near Tirumala Silathoranam video tv9d – Viral Videos in Telugu

Viral Video: పక్షుల గూటిలో వింత శబ్దాలు.. ఏం జరిగిందో తెలుసా? | 9 Foot Rat Snake Rescued from Bird Enclosure Near Tirumala Silathoranam video tv9d – Viral Videos in Telugu


జీవవైవిధ్యానికి నిలయమైన శేషాచలం కొండల్లోని జీవరాశులు ఈ మధ్య కాలంలో తరచూ బయటకు వస్తూ తిరుమల భక్తులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతం నుంచి విషసర్పాలు, కొండచిలువలు, జెర్రిపోతులు చల్లని ప్రాంతాలను వెతుక్కుంటూ నడక మార్గాలు, జనావాసాల మధ్యలోకి వస్తున్నాయి. తాజాగా తిరుమల శిలాతోరణం వద్ద టీటీడీ అటవీశాఖ పక్షుల సంరక్షణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గూటిలోకి ఏకంగా 9 అడుగుల బారీ జెర్రిపోతు ప్రవేశించింది. పక్షుల గూటిలో అంత పెద్ద పామును చూసిన భక్తులు, టీటీడీ సిబ్బంది దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఫారెస్ట్ విభాగంలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్న భాస్కర్ నాయుడుకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న భాస్కర్ నాయుడు ఎంతో చాకచక్యంగా వ్యవహరించి, ఆ 9 అడుగుల జెర్రిపోతును సురక్షితంగా బంధించారు. అనంతరం దాన్ని శేషాచలం దట్టమైన అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి విడిచిపెట్టారు. పామును సురక్షితంగా పట్టుకోవడంతో అక్కడ ఉన్న భక్తులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Chiranjeevi: రమేష్‌ కుటుంబానికి చిరంజీవి సాయం!

Mahesh Babu: మా అబ్బాయి వస్తున్నాడు.. ఆదరించండి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *