Headlines

Jabardasth Rohini: నీకు ఛాన్స్ ఇస్తే.. నాకు ఏమిస్తావు? అతని గురించి సంచలన విషయాలు బయటపెట్టిన జబర్దస్త్ రోహిణి | Jabardasth Comedian Rohini Opens Up About Her Casting Couch Experience In Television Field

Jabardasth Rohini: నీకు ఛాన్స్ ఇస్తే.. నాకు ఏమిస్తావు? అతని గురించి సంచలన విషయాలు బయటపెట్టిన జబర్దస్త్ రోహిణి | Jabardasth Comedian Rohini Opens Up About Her Casting Couch Experience In Television Field


జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నవారిలో రోహిణీ కూడా ఒకరు. ఈ షోలో ఓ సాధారణ నటిగా ప్రయాణం మొదలుపెట్టి, తన ప్రత్యేక యాస, కామెడీ టైమింగ్‌తో మంచి గుర్తింపు పొందింది రోహిణి. ముఖ్యంగా ఈ లేడీ కమెడియన్ పంచులు, ప్రాసలకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ క్రమంలోనే ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్’లో మొట్టమొదటి లేడీ టీమ్ లీడర్‌గా ఎంపికైంది. జబర్దస్త్ తో పాటు శ్రీదేవీ డ్రామా కంపెనీ వంటి టీవీ షోల్లోనూ చేస్తూ బుల్లితెర ఆడియెన్స్ కు బోలెడు వినోదం అందిస్తోంది రోహిణి. అలాగే సినిమాలతో పాటు సేవ్ ది టైగర్స్ వంటి వెబ్ సిరీసుల్లోనూ నటిస్తూ బిజీగా ఉంటోంది రోహిణి. ఇక బిగ్ బాస్ షోలో పాల్గొని ప్రేక్షకులను మరింతగా అలరించిందీ అందాల తార. అలాగే సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉంటూ ఆసక్తికరమైన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ తన ఫాలోవర్లను పెంచుకుంటోంది. ఇదిలా ఉంటే ఆ మధ్యన ఓ ఇంటర్వ్యూకు హాజరైన రోహిణీ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ముఖ్యంగా సినిమా రంగంతో పాటు టెలివిజన్ రంగంలోనూ నిర్భయంగా కమిట్ మెంట్లు అడుగుతున్నారని రోహిణీ బయట పెట్టింది.కెరీర్ ప్రారంభంలో తాను కూడా అలాంటి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నానని ఓ ఇంటర్వ్యూలో వాపోయిందీ జబర్దస్త్ నటి.

‘కెరీర్ ప్రారంభంలో ఓ సీరియల్ కోసమని ఆడిషన్ కు వెళ్లాను. అప్పుడు నీకు ఛాన్స్ ఇస్తే కమిట్ మెంట్ ఇవ్వాలని ఓ ప్రొడ్యూసర్ కు సంబంధించిన మేనేజర్ డైరెక్ట్ గా అడిగాడు. అయితే అప్పట్లో నాకు దీని గురించి పెద్దగా తెలియకపోవడంతో కమిట్ మెంట్ గా వర్క్ గా చేస్తానని, వర్క్ విషయంలో ఎంతైనా కష్టపడుతానని అతనితో చెప్పేశాను. కానీ తీరా విషయం తెలిశాక చాలా బాధపడ్డాను. వెంటనే ఈ విషయాన్ని నాకు తెలిసిన అంకుల్ కు చెప్పాను. ఆయన సదరు ప్రొడ్యూసర్ కు ఫోన్ చేసి సీరియస్ బాగా అయ్యారు. అయితే ఇది జరిగిన తర్వాత ఆ ప్రొడ్యూసర్ నేను నిన్ను అడిగానా? అని పెద్ద గొంతేసుకొని నాపై అరిచాడు’.

ఇవి కూడా చదవండి



భానుశ్రీతో వెకేషన్ లో రోహిణి..

అయినా ఈ సంఘటన జరిగిన తర్వాత మరోసారి ఇంకో ప్రొడ్యూసర్ దగ్గరకు వెళ్లినప్పుడు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఓ ప్రముఖ ఛానెల్ సీరియల్ లో అవకాశం కల్పిస్తానని కమిట్ మెంట్ అడిగాడు. నీకు ఛాన్స్ ఇస్తే నాకేమీ ఇస్తావంటూ నిర్లజ్జగా అడిగేశాడు. అయితే నేను మాత్రం అతనిని గట్టిగా తిట్టి బయటకు వచ్చేశాను’ అని చేదు అనుభవాలను గుర్తుకు తెచ్చుకుంది జబర్దస్త్ రోహిణి. ప్రస్తుతం ఈ నటి కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *