Headlines

OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ కొరియన్ హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఒంటరిగా చూడొద్దు | Korean Horror Thriller Ghost Train Movie Is Streaming Now On Amazon Prime Video OTT

OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ కొరియన్ హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఒంటరిగా చూడొద్దు | Korean Horror Thriller Ghost Train Movie Is Streaming Now On Amazon Prime Video OTT


ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. తెలుగుతో పాటు వివిధ భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ పై సందడి చేయనున్నాయి. దీవానా, రావు బహదూర్ వంటి తెలుగు సినిమాలతో పాటు చిన్న చిన్న ఆశై, బాలన్ ద బాయ్, లవ్ ఓ లవ్ వంటి డబ్బింగ్ సినిమాలు ఓటీటీలో సందడి చేయనున్నాయి. అలాగే అబ్జెషన్ మై లార్డ్, ఆజాదీ 501, హార్ట్ బీట్ సీజన్ 3 లాంటి వెబ్ సిరీస్ లు కూడా ఈ వీకెండ్ లోనే ఓటీటీలోకి అందుబాటులోకి రానున్నాయి. అయితే వీటి కంటే ముందే ఓ కొరియన్ హారర్ థ్రిల్లర్ సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా 2024లోనే రిలీజై సంచలన విజయం సాధించింది. అయితే ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఇంగ్లిష్ తో పాటు తెలుగులోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. కేవలం గంటన్నర నిడివితో ఉండే ఈ సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సాగుతుంది. ట్విస్టులు కూడా ఓ రేంజ్ లో ఉంటాయి. ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. సోషల్ మీడియా, మనుషుల్ని ఎలా తయారు చేస్తుంది? లైక్స్, వ్యూస్ కోసం ప్రాణాలు ఎలా రిస్క్‌లో పెడుతున్నారు? అనే అంశాన్ని ఇందులో కళ్లకు కట్టినట్లు చూపించారు. హారర్, సూపర్ నేచురల్ స్టోరీలపై ఓ యూట్యూబర్ వీడియోలు చేస్తూ ఉంటుంది. కానీ ఎవరూ పెద్దగా పట్టించుకోరు. పెద్దగా వ్యూస్ రాకపోవడంతో ఓసారి భయంకరమైన రూమర్స్ వినిపించే రైల్వే స్టేషన్‌కి వెళ్తుంది. అక్కడి స్టేషన్ మాస్టర్ ఈ యూట్యూబర్ కు ఓ నాలుగు స్టోరీలు చెబుతాడు?

ఆ కథలు విన్న తర్వాత ఆ యూట్యూబర్ కు రైల్వే స్టేషన్ లో ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. వ్యూస్ కోసం వెళ్లిన ఆమె స్వయంగా ఆ భయంకరమైన ఘోస్ట్ ట్రైన్ ఉచ్చులో ఎలా చిక్కుకుంది? చివరకు ఆ వింత స్టేషన్ మిస్టరీ నుంచి ప్రాణాలతో బయటపడిందా లేదా అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి



అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఘోస్ట్ ట్రైన్..

ఆద్యంతం ఆసక్తికరమైన కథా కథనాలు, ఉత్కంఠ రేపే సన్నివేశాలు, ఊహించని ట్విస్టులతో సాగే ఈ కొరియన్ సినిమా పేరు ఘోస్ట్ ట్రైన్. 2024 లో థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల వెన్నులో వణుకు పుట్టించిన ఈ సినిమా సుమారు రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లిష్ తో పాటు తెలుగు భాషలలోనూ ఘోస్ట్ ట్రైన్ అందుబాటులో ఉండడం విశేషం.

ఘోస్ట్ ట్రైన్ సినిమా ట్రైలర్



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *