Headlines

Naga Chaitanya: ఇలాంటి లవ్‌స్టోరీల కోసం చాలా ఎదురుచూశా.. యంగ్ హీరో సినిమాపై నాగ చైతన్య ప్రశంసలు | Naga Chaitanya Interesting Comments At Chennai Love Story Success Meet

Naga Chaitanya: ఇలాంటి లవ్‌స్టోరీల కోసం చాలా ఎదురుచూశా.. యంగ్ హీరో సినిమాపై నాగ చైతన్య ప్రశంసలు | Naga Chaitanya Interesting Comments At Chennai Love Story Success Meet


యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, తెలుగమ్మాయి శ్రీ గౌరి ప్రియ జంటగా నటించిన చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం మంగళవారం (జులై 28) సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి అక్కినేని నాగచైతన్య ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా నాగ చైతన్య మాట్లాడుతూ.. ‘కిరణ్ అబ్బవరంకు ముందు కంగ్రాట్స్.. మీ సక్సెస్‌ను సెలబ్రేట్ చేయడం నాకు ఆనందంగా ఉంది.. సాయి రాజేష్ నాకు ట్రైలర్ రిలీజ్ ముందే ఫోన్ చేసారు కానీ వేరే కమిట్‌మెంట్‌లో ఉన్నందుకు రాలేదు. లవ్ స్టోరీస్ అంటే నాకు పిచ్చి.. ఒక టైమ్‌లో కోవిడ్ తర్వాత లవ్ స్టోరీస్ తగ్గిపోతున్నాయని భయమేసింది. మెల్లగా మళ్ళీ ఆ ట్రెండ్ స్టార్ట్ అయింది. చెన్నై లవ్ స్టోరీతో కల్ట్ ఇచ్చారు.
నెంబర్స్ ఆఫ్ లవ్ స్టోరీస్ చూసేసాం.. కాస్ట్ రిలీజియన్ అన్నీ చూసాం.. కానీ ఒక పెళ్లైన తర్వాత స్టోరీ ఏంటి, హార్ట్ బ్రేక్ తర్వాత స్టోరీ ఏంటనే ఎన్నో ఉంటాయి. ఇప్పుడు జనరేషన్‌కు అవే కనెక్ట్ అవుతున్నాయి. నాలుగు గోడల మధ్య ఒక కపుల్ మధ్య జరిగే హై అండ్ లోస్ ఎవరూ టచ్ చేయట్లేదు. అలాంటిది చెన్నై లవ్ స్టోరీ వచ్చింది. రైటింగ్‌లో చాలా మెచ్యూరిటీ ఉంది..
ఇంత ప్యూరిటీ ఉన్న కథను రాసి మరో దర్శకుడికి ఈ కథను ఇచ్చినందుకు సాయిరాజేష్‌ చాలా గ్రేట్.. దానికి హ్యాట్సాఫ్. బేబీ టైమ్‌లో రవి నంబూరి హెల్ప్ చేసాడని ఇప్పుడు లైఫ్ ఇచ్చాడు రాజేష్. ఇలాంటి మెచ్యూర్ టాపిక్, కాంప్లెక్స్ సీన్స్ ఇలాంటి ఎమోషన్స్ ప్రజెంట్ చేయడం, చాలా గ్రౌండ్ లెవల్‌లో చేయడం అనేది చాలా బాగుంది’.

‘SKN సినిమాను గ్రౌండ్ లెవల్ ఆడియన్స్‌కు తీసుకెళ్లడంలో ఎక్స్‌పర్ట్. తండేల్ టైమ్‌లో చందూ, వాసులతో కూడా చెప్పాను నేను SKN సపోర్ట్ తీసుకుందాం అని. కిరణ్ అబ్బవరంను క సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో చూసి బాధ పడ్డాను ఎందుకు అన్ని కష్టాలో అని. కానీ అవన్నీ దాటుకుని ఈరోజు కిరణ్ అంటే ఓ బ్రాండ్‌లా నిలబడ్డాడు. గౌరీ నాకు లవ్ స్టోరీతో పరిచయం.. ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్ ఒప్పుకుని చేయడం చిన్న విషయం కాదు. ఆల్కహాలిక్ అమ్మాయి పాత్ర ఈజీ కాదు.. చాలా పెద్ద బాధ్యత ఉంది ఆమె మీద.. ప్రతీ యాక్టర్‌కు కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ అని చెప్పుకునే సినిమా ఉంటుంది అది గౌరీకి చెన్నై లవ్ స్టోరీ. సినిమాలా కాకుండా రియల్ లైఫ్ కంటెంట్‌గా అనిపించింది. సాయి రాజేష్, కిరణ్, ఎస్‌కేఎన్ అయినా వీళ్లంతా గ్రౌండ్ నుంచి వచ్చారు. ఏ సపోర్ట్ లేకుండా వచ్చి ఫైట్ చేసి ఎదిగారు. నాకే కాదు చాలా మంది న్యూ కమర్స్‌కు ఇన్‌స్పిరేషన్. ఎలాంటి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి సక్సెస్ అవ్వడం అనేది గ్రేట్. పోస్టర్ మీద కలెక్షన్స్ వేయడం కాదు సక్సెస్ అంటే ఇదే నిజమైన సక్సెస్. సొంతంగా ఎదగడమే రియల్ సక్సెస్. మణిశర్మ గారు మ్యాజిక్ చేసారు. అనంత్ శ్రీరామ్‌తో నా జర్నీ ఏ మాయ చేసావేతో మొదలైంది. సీడెడ్‌లో ఓ లవ్ స్టోరీ ఈ నెంబర్స్ కలెక్ట్ చేయడం చిన్న విషయం కాదు’ అని చెప్పుకొచ్చారు నాగ చైతన్య

ఇవి కూడా చదవండి



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *