Headlines

చల్లని వెదర్‌లో వేడి వేడిగా, నోరూరించే క్రిస్పీ మసాలా పూరీ.. ఇంట్లోనే చేయండిలా.. | Crispy Masala Poori Recipe | Easy Homemade Spicy Indian Fried Bread

చల్లని వెదర్‌లో వేడి వేడిగా, నోరూరించే క్రిస్పీ మసాలా పూరీ.. ఇంట్లోనే చేయండిలా.. | Crispy Masala Poori Recipe | Easy Homemade Spicy Indian Fried Bread


భారతీయ వంటకాల్లో పూరీకి ఉన్న ప్రాధాన్యత ప్రత్యేకమైనది. అయితే సాధారణ పూరీలకు భిన్నంగా కొద్దిగా మసాలాలు, శనగపిండి కలిపి చేసే మసాలా పూరీ తింటే ఆ రుచే వేరు. దీనిలోని క్రిస్పీ టెక్స్చర్, కారంగా ఉండే రుచి వల్ల ఇది ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. మార్నింగ్‌ బ్రేక్‌ఫాస్ట్‌లోకి లేదా పిల్లల లంచ్ బాక్స్, ప్రయాణాల కోసం ఇది ఒక అద్భుతమైన ఎంపిక. ఈ మసాల పూరీ తయారీ విధానం, కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం..

కావలసిన పదార్థాలు:

గోధుమ పిండి: 2 కప్పులు

శనగపిండి: 1/2 కప్పు

ఇవి కూడా చదవండి



ఉప్మా రవ్వ: 2 టేబుల్ స్పూన్లు (క్రిస్పీగా రావడం కోసం)

వాము: 1/2 టీస్పూన్

కారం: 1 టీస్పూన్

పసుపు: 1/2 టీస్పూన్

జీలకర్ర పొడి: 1/2 టీస్పూన్

గరం మసాలా: 1/2 టీస్పూన్

కసూరి మేతీ: 1 టేబుల్ స్పూన్

నూనె: వేయించడానికి సరిపడా

ఉప్పు: రుచికి తగినంత

కొత్తిమీర తరుగు: కొద్దిగా

తయారీ విధానం:

ముందుగా ఒక పెద్ద పాత్రలో గోధుమ పిండి, శనగపిండి, బొంబాయి రవ్వ తీసుకోండి. అందులో కారం, పసుపు, జీలకర్ర పొడి, గరం మసాలా, కసూరి మేతీ, నలిపిన వాము, కొత్తిమీర తరుగు, సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో ఒక టేబుల్ స్పూన్ వేడి నూనె వేసి కలిపిన తర్వాత, కొద్దికొద్దిగా నీళ్లు చల్లుకుంటూ పూరీ పిండిలా గట్టిగా కలుపుకోవాలి. పిండి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా గట్టిగా ఉంటే పూరీలు నూనె ఎక్కువగా పీల్చవు. కలిపిన పిండి ముద్దపై కొద్దిగా నూనె రాసి మూత పెట్టి 10 నుండి 15 నిమిషాల పాటు పక్కన ఉంచాలి.

పూరీలు ఒత్తుకోవడం:

పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, పూరీ పీటపై కొద్దిగా నూనె రాసి పూరీల్లా ఒత్తుకోవాలి. పూరీలు మరీ పల్చగా లేదా మరీ మందంగా ఉండకూడదు. మరొపక్క బాణలిలో నూనె పోసి బాగా వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత పూరీని అందులో వేసి గరిటెతో తేలికగా నొక్కితే పూరీ చక్కగా పొంగుతుంది. రెండు వైపులా బంగారు వర్ణం వచ్చేవరకు వేయించి తీసివేస్తే వేడివేడి మసాలా పూరీ రెడీ అవుతుంది. ఈ వేడివేడి మసాలా పూరీలను ఆలూ కుర్మా, చట్నీ లేదా పెరుగుతో తింటే అద్భుతంగా ఉంటుంది. ఎంతో సులభంగా తయారయ్యే ఈ వంటకాన్ని మీరు కూడా తప్పక ప్రయత్నించండి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *