Headlines

అర్రెర్రె.. బ్లాక్ బస్టర్ మిస్ అయ్యిందే..! మహేష్ బాబు వదులుకున్న కథతో భారీ హిట్ కొట్టిన అల్లు అర్జున్ | Did you know Allu Arjun got success with a story that Mahesh Babu had turned down, it is Race Gurram movie

అర్రెర్రె.. బ్లాక్ బస్టర్ మిస్ అయ్యిందే..! మహేష్ బాబు వదులుకున్న కథతో భారీ హిట్ కొట్టిన అల్లు అర్జున్ | Did you know Allu Arjun got success with a story that Mahesh Babu had turned down, it is Race Gurram movie


సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వారణాసి సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పాన్ వరల్డ్ గా రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం రాక సినిమాతో బిజీగా ఉన్నాడు. అట్లీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా రానుంది. ఈ సినిమాతో పాటు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు బన్నీ. మహేష్ బాబు అల్లు అర్జున్ ఇద్దరూ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా దూసుకుపోతున్నారు. ఇద్దరికీ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉన్నారు. అయితే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న అల్లు అర్జున్, మహేష్ బాబు తమ కెరీర్ లోకొన్ని సినిమాలు వదులుకోవాల్సి వస్తుంది. అలా మహేష్ బాబు కూడా కొన్ని సినిమాలను వదిలేశాడు. డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోవడం, కథలు సూట్ కాకపోవడం తదితర కారణాలతో కొన్ని సినిమాలను పక్కన పెట్టేశారు.

ఇదికూడా చదవండి : అమ్మబాబోయ్.. ఇదెక్కడి మార్పు రా మావ..!! ఈ చిన్నది ఇప్పుడు సోషల్ మీడియా సెన్సేషన్

అలా మహేష్ బాబు పక్కన పెట్టేసిన కథతో అల్లు అర్జున్ సినిమా చేసి భారీ హిట్ కొట్టాడు. ఆ సినిమా ఎదో కాదు స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్ టైనర్ రేసు గుర్రం. ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో అల్లు అర్జున్ తన నటనతో ఆకట్టుకున్నాడు. రేసు గుర్రం సినిమాతో బన్నీ క్రేజ్ డబుల్ అయ్యిందనే చెప్పాలి. అయితే  ముందుగా ఈ కథను సూపర్ స్టార్ మహేశ్ బాబును దృష్టిలో పెట్టుకుని స్టైలిష్ గా హీరో పాత్రను డిజైన్ చేశారట సురేందర్ రెడ్డి. మహేశ్ కు కథ కూడా వినిపించడట. మహేష్ కు కూడా కథ బాగా నచ్చిందట.. అయితే అప్పటికే బిజీ షెడ్యూల్ ఉండడంతో రేసు గుర్రం సినిమాకు టైం పడుతుందని చెప్పారట.

ఇదికూడా చదవండి :ఆ కళ్లలోనే ఎదో మాయ ఉంది..! ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? చాలా మంది పప్పులో కాలేశారు

దాంతో అదే కథను బన్నీకి వినిపించాడట. రేసుగుర్రం కథ బాగా నచ్చింది. వెంటనే ఒకే చెప్పేశాడు. దీంతో ఈ సినిమా పట్టాలెక్కింది. ఈ సినిమాలో యాక్షన్, కామెడీ, బ్రదర్ సెంటిమెంట్ అన్నీ బాగా వర్కవుట్ అయ్యాయి. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అంతే కాదు రేసు గుర్రం సినిమాతోనే అల్లు అర్జున్ మొదటిసారి రూ.50 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. ఈ సినిమాలో హీరో అల్లు అర్జున్ పాత్రతో పాటు అతని సోదరుడిగా నటించిన తమిళ నటుడు శ్యామ్ రోల్ కు కూడా మంచి స్పందన వచ్చింది. విలన్ మద్దాలి శివారెడ్డి పాత్రలో రవి కిషన్ కూడా తెలుగులో బాగా ఫేమస్ అయిపోయాడు. ఇక సినిమాలో తమన్ పాటలు సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఇలా మహేష్ మిస్ చేసుకున్న సినిమాతో బన్నీ బ్లాక్ బస్టర్ కొట్టాడు.

ఇవి కూడా చదవండి



ఇదికూడా చదవండి :ఎప్పుడూ లవ్ సాంగ్స్, ఫోక్ సాంగ్స్ మాత్రమే కాదు..! ఒక్కసారి ఈ పాట విను మావ.. ఒళ్లు పులకరించిపోతుంది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *