Headlines

NCC సర్టిఫికెట్‌ ఉన్న అమ్మాయిలకు ఆర్మీలో ఉద్యోగాలు.. డిగ్రీ అర్హతతో నేరుగా లెఫ్టినెంట్ జాబ్స్ | Indian Army NCC Special Entry Scheme 125 Course: Total 6 Vacancies Open for Women Candidates

NCC సర్టిఫికెట్‌ ఉన్న అమ్మాయిలకు ఆర్మీలో ఉద్యోగాలు.. డిగ్రీ అర్హతతో నేరుగా లెఫ్టినెంట్ జాబ్స్ | Indian Army NCC Special Entry Scheme 125 Course: Total 6 Vacancies Open for Women Candidates


భారత సైన్యంలో చేరాలనుకునే మహిళా అభ్యర్థులకు అద్భుత అవకాశం. ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ 125వ కోర్సు (ఏప్రిల్‌ 2027) ద్వారా అర్హత కలిగిన అవివాహిత మహిళా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా షార్ట్ సర్వీస్ కమిషన్ (నాన్-టెక్నికల్) కింద మొత్తం 6 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో ఎన్‌సీసీ మహిళా అభ్యర్థులకు 5 పోస్టులు, ఆర్మీ పర్సనల్ బ్యాటిల్ క్యాజువల్టీస్ వార్డులకు 1 పోస్టు కేటాయించారు. అర్హత కలిగిన అభ్యర్థులు జులై 21, 2026వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇండియన్ ఆర్మీలో మహిళల ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే ఎన్‌సీసీ అభ్యర్థులు తప్పనిసరిగా బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే ఎన్‌సీసీ సీనియర్ డివిజన్ లేదా వింగ్‌లో నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా నిర్దేశిత కాలం సేవ చేసి ఉండాలి. అదేవిధంగా ఎన్‌సీసీలో ‘సి’ సర్టిఫికెట్ పరీక్షలో కనీసం ‘బి’ గ్రేడ్ సాధించి ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఆర్మీ పర్సనల్ బ్యాటిల్ క్యాజువల్టీస్ వార్డులకు మాత్రం NCC ‘సి’ సర్టిఫికెట్ తప్పనిసరి కాదు. అలాగే ఇతర విద్యార్హతలు, అవసరమైన ధ్రువపత్రాలు మాత్రం ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి 2027 జనవరి 1 నాటికి తప్పనిసరిగా 19 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. అంటే అభ్యర్థులు 2002 జనవరి 2 నుంచి 2008 జనవరి 1 మధ్య జన్మించి ఉండాలి. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో ఆగస్టు 21, 2026వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే దరఖాస్తుల పరిశీలన, షార్ట్‌లిస్టింగ్, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ, మెడికల్ పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్ధుల తుది ఎంపిక ఉంటుంది. అన్ని దశల్లో అర్హత సాధించిన అభ్యర్థులను మాత్రమే తుది ఎంపిక చేస్తారు.

ఎంపికైన అభ్యర్థులకు చెన్నైలోని ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీ (OTA)లో 49 వారాల పాటు శిక్షణ అందిస్తారు. శిక్షణ సమయంలో నెలకు రూ.56,100 చొప్పున స్టైపెండ్ చెల్లిస్తారు. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసిన వారికి పోస్ట్ డిప్లొమా ఇన్ డిఫెన్స్ మేనేజ్‌మెంట్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ డిగ్రీని మద్రాస్ యూనివర్సిటీ ప్రదానం చేస్తుంది. అనంతరం అభ్యర్థులను భారత సైన్యంలో లెఫ్టినెంట్ హోదాలో నియమిస్తారు. భారత సైన్యంలో ఆఫీసర్‌గా కెరీర్ ప్రారంభించాలనుకునే మహిళా గ్రాడ్యుయేట్లకు ఈ ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ మంచి అవకాశంగా నిలవనుంది.

ఇండియన్ ఆర్మీలో మహిళల ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *