Headlines

Investment Tips: నెలకు రూ.5 వేలతో ఏకంగా రూ.16 లక్షలు మీకే.. కేంద్రం గొప్ప పథకం.. | PPF for Children: Invest 5000 a Month and Build Over 16 Lakh in 15 Years

Investment Tips: నెలకు రూ.5 వేలతో ఏకంగా రూ.16 లక్షలు మీకే.. కేంద్రం గొప్ప పథకం.. | PPF for Children: Invest 5000 a Month and Build Over 16 Lakh in 15 Years


పిల్లల చదువులు, పెళ్లిళ్లు, వారి ఆర్ధిక అవసరాల కోసం డబ్బులు పొదుపు చేయాలని చాలామంది తల్లిదండ్రులకు ఉంటుంది. ఇందుకోసం అనేక రిస్క్ లేని పెట్టుబడుల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఇందుకోసం అనేక ఆప్షన్లు అందుబాటులో ఉన్నప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం గ్యారెంటీ అందించే పథకాల కోసం ఎక్కువ చూస్తూ ఉంటారు. డబ్బులు పొదుపు చేసుకునేందుకు ప్రజలకు అనేక చిన్న పొదుపు పథకాలను కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. అందులో బాగా పాపులర్ అయిన స్కీమ్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫంట్(PPF). పిల్లల పేర్లపై కూడా ఈ ఖాతా తెరవొచ్చు. పిల్లల పేర్లపై అకౌంట్ ఎలా తెరవాలి..? ఎంత పెట్టుబడి పెట్టాలి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

ప్రతీ నెలా రూ.5 వేలు జమ చేస్తే..

పీఎఫ్ ఖాతాలో ఒక ఆర్ధిక సంవత్సరంలో రూ.500 కనీస పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.
అయితే ప్రతి నెలా మీ పిల్లల PPF ఖాతాలో రూ. 5 వేలు జమ చేయండి. ఇలా చేస్తే సంవత్సరానికి రూ. 60 వేలు అవుతాయి. ప్రస్తుతం PPFపై కేంద్ర ప్రభుత్వం 7.1 శాతం వార్షిక వడ్డీ రేటును అందిస్తోంది. 15 సంవత్సరాల పాటు ఇలాగే ప్రతీ నెలా రూ.5 వేలు పెట్టుబడి కొనసాగిస్తే.. మొత్తం రూ.9 లక్షలు అవుతాయి. రూ.9 లక్షలపై మీరు సుమారుగా రూ.7,27,284 వడ్డీ అందుతుంది. అంటే 15 సంవత్సరాల తర్వాత సుమారుగా రూ.1,627,284 ఒకేసారి చేతికి అందుతాయి. ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి PPF వడ్డీ రేట్లను సవరిస్తూ ఉంటుంది. దీంతో మీకు అందే మొత్తం భవిష్యత్తులో పెరగవచ్చు.

మైనర్ల పేరు మీద ఖాతా తెరవొచ్చా..?

మైనర్ పిల్లల పేరు మీద PPF ఖాతాను తల్లిదండ్రులు తెరవొచ్చు. అయితే ఒక సంవత్సరంలో రూ.1.5 లక్షలకు మించి జమ చేయకూడదు. మీరు ఇప్పటికే మీ ఖాతాలో ఏటా రూ.1.5 లక్షలు జమ చేస్తుంటే.. అదే సంవత్సరంలో మీ పిల్లల ఖాతాలో విడిగా డబ్బు జమ చేయలేరు. అందువల్ల డబ్బు జమ చేసేటప్పుడు ఈ పరిమితిని తప్పకుండా గుర్తుంచుకోండి. ఇక PPFలో అనేక పన్ను ప్రయోజనాలు ఉన్నాయి. ఐటీ చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. అలాగే ప్రతి సంవత్సరం జమ అయ్యే వడ్డీతో పాటు 15 సంవత్సరాల తర్వాత మీరు అందుకునే పూర్తి మొత్తంపై ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ చెల్లించాల్సిన పని లేదు. ఇక PPF చక్రవడ్డీ కూడా పొందవచ్చు. మీ వడ్డీపై కూడా వడ్డీ జమ అవుతుంది. 15 సంవత్సరాల తర్వాత మీకు ఆ డబ్బు అవసరం లేకపోతే ఒక ఫారం నింపడం ద్వారా మీరు ఖాతాను మరో 5 సంవత్సరాల పాటు పొడిగించుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *