Headlines

చైనా సరికొత్త రోబో.. దీని స్పెషాలిటీ తెలిస్తే షాకవ్వాల్సిందే! | China’s Unitree Unveils AI Robot Dog That Carries Luggage and Conquers Tough Terrain video tv9d – Technology Videos in Telugu

చైనా సరికొత్త రోబో.. దీని స్పెషాలిటీ తెలిస్తే షాకవ్వాల్సిందే! | China’s Unitree Unveils AI Robot Dog That Carries Luggage and Conquers Tough Terrain video tv9d – Technology Videos in Telugu


పర్యాటకులు, ట్రెక్కింగ్ ప్రియులకు సహాయపడేలా చైనాకు చెందిన ‘యూనిట్రీ రోబోటిక్స్’ సంస్థ ‘యూనిట్రీ ఏఎస్2’ అనే అద్భుతమైన రోబో డాగ్‌ను తయారు చేసింది. కఠినమైన పర్వత ప్రాంతాలు, రాళ్లురప్పల దారులు, బురద నేలల్లో సైతం ఇది సులువుగా ప్రయాణించగలదు. ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా ఈ రోబోకు సంబంధించిన వీడియోను ‘ఎక్స్’ వేదికగా పంచుకోవడంతో ఇది ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ రోబో దాదాపు 15 నుండి 16 కిలోల బరువున్న లగేజీని మోస్తూ, మనుషులను కచ్చితత్వంతో అనుసరించే ‘ఇంటెలిజెంట్ ఫాలో సిస్టమ్’తో పనిచేస్తుంది. 40 డిగ్రీల నిటారుగా ఉన్న వాలులను ఎక్కడం, 50 సెం.మీ ఎత్తైన అడ్డంకులను దాటడం దీని ప్రత్యేకత. ఇందులో చక్రాలు ఉన్న ‘ఏఎస్2-డబ్ల్యూ’ అనే మరొక మోడల్ కూడా అందుబాటులో ఉంది. దుమ్ము, నీటి నుంచి రక్షణ ఇచ్చే IP54 రేటింగ్‌తో ఇది రూపొందింది. కేవలం ప్రయాణాలకే కాకుండా రెస్క్యూ ఆపరేషన్లు, పారిశ్రామిక తనిఖీలు, భద్రతా రంగాల్లో కూడా ఈ రోబో డాగ్ ఎంతగానో ఉపయోగపడుతుందని కంపెనీ స్పష్టం చేసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మన కరెన్సీపై పదేళ్ల ఆంక్షలకు తెర.. రూ.500 నోట్లకు నేపాల్ గ్రీన్ సిగ్నల్

ఇల్లు కొనడానికి పీఎఫ్ డబ్బులు తీస్తున్నారా? ఈ వార్త మీకోసమే!

ఓరి మీ కక్కుర్తి కూలా.. ఇదేం పనిరా సామీ!

ఇకపై నన్ను అలా పిలవొద్దు.. పవన్ అర్ధాంగి ఎమోషనల్ పోస్ట్

గుడ్‌న్యూస్.. బుక్ చేసిన 4 గంటల్లోనే ఎల్పీజీ సిలిండర్ డెలివరీ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *