Headlines

Maniratnam:విజయ్ సేతుపతి-సాయి పల్లవి జంటగా మణిరత్నం కొత్త సినిమా | Mani Ratnam Eyes Strong Comeback with Vijay Sethupathi–Sai Pallavi Romance video – Entertainment Videos in Telugu

Maniratnam:విజయ్ సేతుపతి-సాయి పల్లవి జంటగా మణిరత్నం కొత్త సినిమా | Mani Ratnam Eyes Strong Comeback with Vijay Sethupathi–Sai Pallavi Romance video – Entertainment Videos in Telugu


‘థగ్ లైఫ్’తో రేసులో వెనకబడిపోయిన లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం మళ్లీ ఫామ్‌లోకి వస్తారా..? విజయ్ సేతుపతి, సాయి పల్లవి సినిమాతో ఈయన తన మునపటి మ్యాజిక్ చేస్తారా..? విజయ్ సేతుపతి సరికొత్తగా కనిపిస్తున్న ఈ రొమాంటిక్ డ్రామా ఎలా ఉండబోతుంది..? షూటింగ్ మొదలవకముందే నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ రైట్స్ కొనడానికి కారణమేంటి..? ఎన్ని రోజుల్లో షూట్ పూర్తి చేయాలని మణిరత్నం ప్లాన్ చేస్తున్నారు..? మణిరత్నం కొత్త సినిమా షూటింగ్ కోల్‌కతాలో మొదలైంది. విజయ్ సేతుపతి, సాయి పల్లవి జంటగా వస్తున్న ఈ రొమాంటిక్ డ్రామాపై అంచనాలు బాగానే ఉన్నాయి. సాయి పల్లవికి మణితో వర్క్ చేయడం తొలిసారి కాగా.. విజయ్ సేతుపతి గతంలోనే నవాబ్‌లో ఈ లెజెండరీ దర్శకుడితో కలిసి పని చేశారు. అందులో మక్కల్ సెల్వన్ పాత్ర అదిరిపోతుంది. కొన్నేళ్లుగా గడ్డంతోనే కనిపిస్తున్న విజయ్ సేతుపతి.. మణిరత్నం కొత్త సినిమా కోసం క్లీన్ షేవ్ లుక్‌లోకి మారిపోయారు. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ లవ్ స్టోరీని కోల్‌కతాతో పాటు విశాఖపట్నం, పుదుచ్చేరిలో చిత్రీకరించనున్నారు మణి. కంట్రోల్ బడ్జెట్‌తో కేవలం 60 రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని మణిరత్నం పక్కాగా ప్లాన్ చేసుకున్నారు. గతేడాది థగ్ లైఫ్ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర ఊహించని పరాజయాన్ని మూటగట్టుకున్నారు మణిరత్నం. అందుకే విజయ్ సేతుపతి సినిమాతో ఎలాగైనా సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని కసిగా ఉన్నారు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ ప్రాజెక్ట్ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ షూట్‌కు ముందే దక్కించుకుంది. మరి ఈ లవ్ స్టోరీతో ఒకప్పటి మ్యాజికల్ మణిరత్నం మళ్లీ కనిపిస్తారా..?

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చైనా సరికొత్త రోబో.. దీని స్పెషాలిటీ తెలిస్తే షాకవ్వాల్సిందే!

మన కరెన్సీపై పదేళ్ల ఆంక్షలకు తెర.. రూ.500 నోట్లకు నేపాల్ గ్రీన్ సిగ్నల్

ఇల్లు కొనడానికి పీఎఫ్ డబ్బులు తీస్తున్నారా? ఈ వార్త మీకోసమే!

ఓరి మీ కక్కుర్తి కూలా.. ఇదేం పనిరా సామీ!

ఇకపై నన్ను అలా పిలవొద్దు.. పవన్ అర్ధాంగి ఎమోషనల్ పోస్ట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *