Headlines

ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే మావ..! భరణి మూవీ హీరోయిన్ ఎంత మారిపోయింది.. ఇప్పుడు ఎలా ఉందంటే | Do you remember this actress who starred in the movie Vishal Bharani, Here is how she looks now

ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే మావ..! భరణి మూవీ హీరోయిన్ ఎంత మారిపోయింది.. ఇప్పుడు ఎలా ఉందంటే | Do you remember this actress who starred in the movie Vishal Bharani, Here is how she looks now


ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా రాణించాలంటే అదృష్టం ఉండాలి. అందం, అభినయంతో పాటు ఆవగింజంత అదృష్టం లేకపోతే ఇండస్ట్రీలో కొనసాగడం కష్టమే.. చాలా మంది ముద్దుగుమ్మలు ఒకటి రెండు సినిమాలతోనే కనిపించకుండా మాయం అవుతున్నారు. హిట్స్ అందుకున్నా కూడా ఇండస్ట్రీలో కంటిన్యూ అవ్వడం కష్టమే..  కొందరు ముద్దుగుమ్మలు ఇండస్ట్రీలో కొన్ని సినిమాలతోనే కనిపించకుండా మాయం అవుతున్నారు. చాలా మంది అందాల తారలు స్టార్ డమ్ సొంతం చేసుకోకుండానే ఇండస్ట్రీ నుంచి దూరం అవుతున్నారు. ఇక కొంతమంది హీరోయిన్స్ కోసం నెటిజన్స్ సోషల్ మీడియాను గాలిస్తూ ఉంటారు. అలాంటి వారిలో ఈ బ్యూటీ ఒకరు. యాక్షన్ హీరో విశాల్ నటించిన భరణి సినిమా గుర్తుందా.? తమిళ్ తెలుగు భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. తెలుగులోనూ ఈ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. భరణి సినిమాలో హీరోయిన్ గా నటించిన భామ గుర్తుందా..?

ఇది కూడా చదవండి : ఏంటీ..! ఈ నటి మేనల్లుడు ఇప్పుడు ఇండస్ట్రీలో తోప్ హీరోనా..!! ఎవరో తెలిస్తే షాక్ అవుతారు

బబ్లీ లుక్స్ తో, ఆకట్టుకునే స్మైల్ తో ఆడియన్స్ ను కవ్వించింది ఈ వయ్యారి భామ. ఒకటి రెండు సినిమాలతోనే ఈ అమ్మడు ఇండస్ట్రీకి దూరం అయ్యింది. ఆ అందాల భామ పేరు ముక్త. ముక్త మలయాళం, తమిళ్ ఇండస్ట్రీలో పలు సినిమాలు చేసింది. చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ వయ్యారి భామ. తన క్యూట్ నెస్ తో కుర్రాళ్ళ మనసులో బాణాలు గుచ్చింది. ముక్త ఓట్ట ననయం అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. ఆతర్వాత వరుసగా సినిమా అవకాశాలు అందుకుంది. ముక్త తెలుగులో నటించిన ఒకే ఒక్క సినిమా ఫోటో. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. ఆ తర్వాత కొన్ని తమిళ్, మలయాళ భాషల్లో సినిమాలు చేసింది.

ఇవి కూడా చదవండి



ఇది కూడా చదవండి : అతన్ని భరించడం నా వల్ల కాదు.. పెళ్లయిన నాలుగు నెలలకే భర్తపై నటి షాకింగ్ పోస్ట్..

ముక్త పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరం అయ్యింది. ఇక ఇప్పుడు ముక్త ఎలా ఉంది.? అని కొంతమంది నెటిజన్స్ సోషల్ మీడియాను తెగ గాలిస్తున్నారు. ఈ క్రమంలో ముక్త లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముక్త కూతురు కూడా సినిమాల్లో నటించింది. ఇక ఇన్నాళ్ల తర్వాత ముక్త తిరిగి సినిమాల్లో బిజీ కానుంది. కురువై పాప అనే సినిమాతో ముక్త రీఎంట్రీ ఇచ్చింది. ముక్త 2015లో సింగర్‌ రిమి టోనీ సోదరుడు రింకు టోమీని పెళ్లాడింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ రెగ్యులర్ గా తన ఫ్యామిలీ ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది.

ఇది కూడా చదవండి : ఆ డైరెక్టర్ నన్ను వద్దు అన్నాడు.. కానీ హీరోయిన్ వల్లే ఇదంతా జరిగింది.. షాకింగ్ విషయం చెప్పిన నందిని రెడ్డి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *