Headlines

Actress : గోల్ఫ్ ఆటలో టాలీవుడ్ హీరోయిన్.. ఒక్కో ఫోజుతో మెంటలెక్కిస్తోన్న గ్లామర్ సెన్సేషన్.. ఎవరంటే.. | Can You Guess This Tollywood Top Heroine Played Golf Photos Goes Viral, She Is Sreeleela

Actress : గోల్ఫ్ ఆటలో టాలీవుడ్ హీరోయిన్.. ఒక్కో ఫోజుతో మెంటలెక్కిస్తోన్న గ్లామర్ సెన్సేషన్.. ఎవరంటే.. | Can You Guess This Tollywood Top Heroine Played Golf Photos Goes Viral, She Is Sreeleela


టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది గ్లామరస్ సెన్సేషన్ హీరోయిన్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు శ్రీలీల. అటు వరుస సినిమాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో మోస్ట్ డిమాండ్ ఉన్న హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. పెళ్లి సందడి సినిమాతో కథానాయికగా పరిచయమై.. ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. దీంతో ఆమెకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తన లేటెస్ట్ విశేషాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అలాగే ప్రముఖ బ్రాండ్ ఎండోర్స్‌మెంట్స్, ఈవెంట్లలో పాల్గొంటూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. తాజాగా ప్రముఖ జపాన్ ఫ్యాషన్ లైఫ్‌స్టైల్ బ్రాండ్ ‘ఒనిట్సుకా టైగర్’ (Onitsuka Tiger) నిర్వహించిన ‘ఒనిట్సుకా టైగర్ గోల్ఫ్ క్లబ్’ ఈవెంట్‌లో శ్రీలీల భాగమై అందరి దృష్టిని ఆకర్శించింది.

ఈ సందర్భంగా గోల్ఫ్ కోర్ట్‌లో సరదాగా సమయాన్ని గడిపిన శ్రీలీల, గోల్ఫ్ ఆడుతూ దిగిన ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేసుకుంది. స్టైలిష్ అండ్ స్పోర్టీ లుక్‌లో దర్శనమిచ్చిన ఆమె ఫోటోలు క్షణాల్లోనే నెట్టింట వైరల్‌గా మారాయి. క్లాసీ కాస్ట్యూమ్స్‌తో గోల్ఫ్ స్టిక్ చేతపట్టుకుని ఆడుతున్న దృశ్యాలు అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి. క్యూట్ అండ్ ఎనర్జెటిక్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఉన్న ఆమె లుక్స్‌కు నెటిజన్లు, ఫ్యాన్స్ ఫిదా అవుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇటీవలి కాలంలో శ్రీలీల ఫ్యాషన్ ప్రపంచంలోనూ తనదైన ముద్ర వేస్తోంది. గ్లామరస్ ఫోటోషూట్లతో పాటు స్పోర్టీ అండ్ ట్రెండీ అవుట్‌ఫిట్లలో కనిపిస్తూ యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఒనిట్సుకా టైగర్ బ్రాండ్ గోల్ఫ్ క్లబ్ ఫోటోలు ఆమెలోని సరికొత్త స్పోర్టీ యాంగిల్‌ను ఆవిష్కరించాయి.

సినిమాల విషయానికొస్తే, టాలీవుడ్‌లో అతి తక్కువ సమయంలోనే స్టార్ డ్యాన్సర్, క్యూట్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీలీల.. వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతోంది. బడా హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఈ గోల్ఫ్ క్లబ్ ఫోటోలు సోషల్ మీడియా వేదికగా బాగా ట్రెండ్ అవుతున్నాయి.

ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: కేవలం నలుగురు మనుషులు.. ప్రతి సీన్ భయానకం.. ఈఓటీటీలో ఈ థ్రిల్లర్ మూవీ సంచలనం..

శ్రీలీల ఇన్ స్టా పోస్ట్..

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ ఇద్దరూ హీరోలకు తల్లిగా అస్సలు నటించను.. సీనియర్ నటి శరణ్య..



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *