Headlines

Dandupalyam : మేడమ్ మీరేనా.. ?! దండుపాళ్యం బ్యూటీని చూస్తే మెంటలెక్కిపోద్ది.. ఇప్పుడు చూస్తే మైండ్ బ్లాంకే.. | Do You Remember Dandupalyam Movie Fame Pooja Gandhi, Now Her Latest Looks Goes Viral

Dandupalyam : మేడమ్ మీరేనా.. ?! దండుపాళ్యం బ్యూటీని చూస్తే మెంటలెక్కిపోద్ది.. ఇప్పుడు చూస్తే మైండ్ బ్లాంకే.. | Do You Remember Dandupalyam Movie Fame Pooja Gandhi, Now Her Latest Looks Goes Viral


కన్నడ సినిమా.. కానీ తెలుగులో బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. ఈ మూవీ క్రియేట్ చేసిన సెన్సేషన్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటికీ ఈ సినిమా వస్తే టీవీలకు అతుక్కుపోతుంటారు. ఆ సినిమా పేరు దండుపాళ్యం. ఎలాంటి అంచనాలు, హడావిడి లేకుండా విడుదలై థియేటర్లలో కళ్లు చెదిరే కలెక్షన్స్ రాబట్టింది. కన్నడ సినిమా అయినప్పటికీ తెలుగులో భారీ వసూళ్లు రాబట్టింది. దండుపాళ్యం, దండుపాళ్యం 2, దండుపాళ్యం 3, దండుపాళ్యం 4 ఇలా మొత్తం నాలుగు సిరీస్ లు విడుదల కాగా.. అన్ని బంపర్ హిట్లు కొట్టాయి. ఈసినిమా ఎంతలా ఫేమస్ అయ్యింది అంటే.. ఎక్కడైనా గుంపులుగా.. లేదా గ్రూపులుగా కనిపిస్తే చాలు దండుపాళ్యం బ్యాచ్ అంటూ తెగ మీమ్స్ చేస్తారు. ఇక ఈ సినిమాతో ఓవర్ నైట్ సెన్సేషన్ అయ్యింది ఓ హీరోయిన్. పక్కా ఊర మాస్ లుక్కులో ఫ్యామిలీ ప్రేక్షకులకు వణుకుపుట్టించింది. బోల్డ్ నెస్, నెగిటివ్ షేడ్స్ యాక్టింగ్ తో ఇరగదీసింది. ఆమె పేరు పూజా గాంధీ. ఈ పేరు అంతగా తెలియకపోవచ్చు. కానీ దండుపాళ్యం లక్ష్మి అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. ఈ మూవీలో లక్ష్మీ పాత్రలో బీభత్సం సృష్టించింది పూజా గాంధీ.

2006లో ముంగురు మేల్ సినిమాతో కన్నడ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది పూజా గాంధీ. ఆ తర్వాత తక్కువ సమయంలోనే విపరీతమైన అవకాశాలు అందుకుంటూ ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించుకుంది. కానీ ఆమెకు బ్రేక్ ఇచ్చింది మాత్రం దండుపాళ్యం సినిమానే. ఈ మూవీతో ఓ రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకుంది. ఇక తెలుగులోనూ ఆమె పలు చిత్రాలు చేసింది. ముక్కంటి, తగ్గేదేలే వంటి చిత్రాల్లో నటించినప్పటికీ అంతగా సక్సెస్ కాలేకపోయింది. ఇక చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది ఈ అమ్మడు.

పూజా గాంధీ విషయానికి వస్తే.. ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో జన్మించిన పూజా గాంధీ, బెంగాలీ, తమిళ సినిమాలతో కెరీర్ ప్రారంభించారు. ఆమె ఎక్కువగా కన్నడలోనే సినిమాలు చేశారు. గ్లామరస్ రోల్స్ మాత్రమే కాకుండా డీగ్లామరైజ్డ్, నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను కూడా అద్భుతంగా చేయగలనని నిరూపించుకున్నారు. ప్రస్తుతం ఆమె లేటేస్ట్ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. ఇప్పుడు ఆమె లుక్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.

ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: కేవలం నలుగురు మనుషులు.. ప్రతి సీన్ భయానకం.. ఈఓటీటీలో ఈ థ్రిల్లర్ మూవీ సంచలనం..

పూజా గాంధీ ఫోటో..

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ ఇద్దరూ హీరోలకు తల్లిగా అస్సలు నటించను.. సీనియర్ నటి శరణ్య..



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *