నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ షూటింగ్ సందర్భంగా గాయపడ్డారు. రాజమండ్రిలో జరుగుతున్న తన తాజా చిత్రం NBK111 షూటింగ్‌లో పాల్గొంటున్న సమయంలో ఆయన ఎడమ మోకాలికి గాయమైనట్లు ఏఐజీ ఆస్పత్రి విడుదల చేసిన మెడికల్ బులెటిన్‌లో వెల్లడించింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు, మెరుగైన పరీక్షలు, ప్రత్యేక చికిత్స కోసం ఆయన్ను ఎయిర్‌లిఫ్ట్ ద్వారా హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు.