Headlines

పెట్రోల్ బాదుడు.. సెంచరీ కొట్టిన ఈవీ సేల్స్! | Rising Fuel Prices Drive Surge in EV and CNG Vehicle Sales Across India video tv9d – Business Videos in Telugu

పెట్రోల్ బాదుడు.. సెంచరీ కొట్టిన ఈవీ సేల్స్! | Rising Fuel Prices Drive Surge in EV and CNG Vehicle Sales Across India video tv9d – Business Videos in Telugu


భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతుండటంతో వాహనదారులు ఎలక్ట్రిక్, సీఎన్‌జీ వాహనాల వైపు మొగ్గుచూపుతున్నారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో దేశంలోని పలు నగరాల్లో లీటరు పెట్రోల్‌పై రూ. 7 నుంచి రూ. 11 వరకు ధర పెరగడమే ఇందుకు ప్రధాన కారణం. జూన్ నెలలో దేశంలో మొత్తం ప్యాసింజర్ వాహనాల విక్రయాలలో ప్రత్యామ్నాయ ఇంధన వాహనాల వాటా ఏకంగా 40 శాతానికి పైగా నమోదు కావడం విశేషం. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ గణాంకాల ప్రకారం, జూన్‌లో విక్రయించిన ప్రత్యామ్నాయ ఇంధన వాహనాలలో సీఎన్‌జీ వాటా 24.3 శాతం కాగా, హైబ్రిడ్ 8.3 శాతం, ఈవీలు 7.8 శాతంగా ఉన్నాయి. మొత్తం ఈవీ విక్రయాలలో ద్విచక్ర వాహనాల వాటానే 63 శాతంగా ఉంది. ఈవీలపై కేవలం 5 శాతం జీఎస్‌టీ మాత్రమే ఉండటం, రాష్ట్ర ప్రభుత్వాల రిజిస్ట్రేషన్ రాయితీలు, ఇంధనంతో పోలిస్తే తక్కువ నిర్వహణ ఖర్చులు వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ విభాగంలో ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలు భారీ వృద్ధిని సాధించాయి. టాటా మోటార్స్ జూన్ నెలలో అత్యధికంగా 15 వేల ఎలక్ట్రిక్ కార్లను విక్రయించి 183 శాతం వృద్ధిని నమోదు చేయగా, బజాజ్, టీవీఎస్ వంటి సంస్థలు ద్విచక్ర వాహనాల విక్రయాలలో భారీ పురోగతి సాధించి ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరిస్తున్నాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘పీఎం ఈ-డ్రైవ్’, ‘ఫేమ్’ పథకాలు, దేశవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న ఛార్జింగ్ స్టేషన్లు కూడా ఈ మార్కెట్‌కు ఎంతో ఊతమిస్తున్నాయి. సాధారణ వినియోగదారులు ఈవీలను ఉపయోగించడం ద్వారా 5 నుంచి 8 ఏళ్లలో సుమారు 20 శాతం వరకు ఆదా చేసుకోవచ్చని నిపుణులు వెల్లడిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వరల్డ్ వండర్ కిడ్స్ .. చిన్న వయసు.. పెద్ద మనసు!

రైలు ఇంజిన్‌ చెక్‌ చేస్తున్న పైలట్‌.. అక్కడ మనిషి తలను చూసి గుండె గుభేల్‌

ఫేస్‌బుక్ ఫ్రెండ్ ఆశల ఎర.. రూ.1.75 కోట్లు పోగొట్టుకున్న మహిళ!

TTD: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారా? బీ అలర్ట్‌!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *