Headlines

Parivartan Yoga: అరుదైన గ్రహ యోగం..ఆ రాశుల వారికి ఊహించని అదృష్టాలు..! | Guru Chandra Parivartana Yoga: These 6 Zodiac Signs May Experience Unexpected Luck

Parivartan Yoga: అరుదైన గ్రహ యోగం..ఆ రాశుల వారికి ఊహించని అదృష్టాలు..! | Guru Chandra Parivartana Yoga: These 6 Zodiac Signs May Experience Unexpected Luck


ఆగస్టు 2, 3, 4 తేదీల్లో గురు, చంద్రుల మధ్య మరోసారి పరివర్తన చోటు చేసుకుంటోంది. గురు శిష్యులైన గురు, చంద్రుల మధ్య పరివర్తన చోటు చేసుకోవడం ఎంతో శుభప్రదం. గురువుకు చెందిన మీన రాశిలో చంద్రుడు, చంద్రుడికి చెందిన కర్కాటక రాశిలో గురువు సంచారం చేయడం వల్ల ఈ పరివర్తన ఏర్పడింది. చంద్రుడు వక్రించిన శనితో యుతి చెందడం, ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువుతో రవి యుతి చెందడం వల్ల ఈ పరివర్తన మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమయంలో వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మీన రాశులవారికి ఊహించని అదృష్టాలు కలుగుతాయి. వీరి జీవితాల్లో కీలకమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.

వృషభం

ఈ రాశికి తృతీయ, లాభాధిపతుల మధ్య పరివర్తన చోటు చేసుకోవడం వల్ల కొన్ని ఊహించని ఆకస్మిక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మనసులోని కోరికలు, ఆశలు, ఆకాంక్షలు చాలావరకు నెరవేరుతాయి. ఈ పరివర్తన కాలంలో తలపెట్టిన ప్రయత్నాలన్నీ నూరు శాతం సఫలమవుతాయి. ఆదాయం వృద్ధి చెందడం, నిరుద్యోగులకు ఉద్యోగం లభించడం, పెళ్లి సంబంధం కుదరడం వంటివి జరుగుతాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది.

మిథునం

ఈ రాశికి ధన, దశమాదిపతుల మధ్య పరివర్తన జరగడం వల్ల ఉద్యోగ జీవితం కొత్త పుంతలు తొక్కుతుంది. ఉద్యోగంలో అధికార యోగం పట్టడం, జీతభత్యాలు పెరగడం, మరింత మంచి ఉద్యోగంలోకి మారడం, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందడం, వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్ల డం వంటివి తప్పకుండా జరుగుతాయి. వారసత్వ ఆస్తి లభిస్తుంది. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారమవుతుంది.. పిత్రార్జితం లభిస్తుంది. విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో పెళ్లి కుదురుతుంది..

ఇవి కూడా చదవండి



కర్కాటకం

రాశ్యధిపతి చంద్రుడికి, భాగ్యాధిపతి గురువుకు మధ్య పరివర్తన జరగడం అత్యంత శుభప్రదం. రాజపూజ్యాలు కలుగుతాయి. రాజయోగాలు పడతాయి. ప్రముఖులతో పరిచయాలు బాగా వృద్ధి చెందుతాయి. ప్రభుత్వ ఉన్నతోద్యోగాలకు సంబందించిన పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల్లో ఘన విజయాలు సాధిస్తారు. ఉద్యోగంలో అధికారయోగం పడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది..

కన్య

ఈ రాశికి సప్తమ, లాభాధిపతుల మధ్య పరివర్తన జరగడం వల్ల ఈ మూడు రోజుల కాలంలో ఎలాంటి ప్రయత్నం చేపట్టినా సక్సెస్ అవుతుంది. విజయాలు, సాఫల్యాలు ఎక్కువగా అనుభవా నికి వస్తాయి. షేర్లు, ఆర్థిక లావాదేవీలతో సహా అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు బిజీగా పురోగమిస్తాయి. ఉన్నత కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం కలుగు తుంది.

వృశ్చికం

ఈ రాశికి పంచమ, భాగ్యాధిపతుల మధ్య పరివర్తన జరగడం వల్ల మనసులోని కోరికలు, ఆకాం క్షలు చాలావరకు నెరవేరుతాయి. ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచిది. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ఉద్యోగంలో పదోన్నతికి, భారీ జీతభత్యాలకు అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ పెరుగుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.

మీనం

రాశ్యధిపతి గురువుతో పంచమాధిపతి చంద్రుడికి పరివర్తన జరగడం వల్ల జీవితంలో కీలకమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. శుభవార్తలు ఎక్కువగా వింటారు. ఇంట్లో శుభ కార్యా లకు మార్గం సుగమం అవుతుంది. సంతాన యోగం పడుతుంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. నైపుణ్యాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగంలో శీఘ్ర పురోగతి ఉంటుంది. అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది. విదేశీ ఆఫర్లు అందుతాయి. ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది.

మాసఫలాలు: ఆగస్టు మాసంలో వీరి జాతకం మారబోతోంది..! అదృష్ట రాశులివే..

గమనిక: ఈ కథనం జ్యోతిష్య శాస్త్రంలోని గ్రహ సంచారాలు, గోచారాలు, పరివర్తన యోగాల ఆధారంగా రూపొందించబడింది. వ్యక్తిగత జాతకం, జన్మ నక్షత్రం, ఇతర గ్రహస్థితులను బట్టి ఫలితాలు వ్యక్తికి వ్యక్తికి మారవచ్చు. వీటిని కేవలం విశ్వాసం, అవగాహన, సమాచారం కోసం మాత్రమే పరిగణించాలి. ఆర్థిక, ఆరోగ్య, విద్య, ఉద్యోగం లేదా ఇతర ముఖ్యమైన జీవిత నిర్ణయాల కోసం సంబంధిత నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *