Headlines

Viral Video: దేవుడిలా వచ్చాడు.. ప్రాణాలకు తెగించి మహిళను కాపాడిన డెలివరీ బాయ్.. వీడియో చూడండి.. | Delivery Driver Jumps Off 40ft Bridge to Save Drowning Woman in China, Watch Viral Video

Viral Video: దేవుడిలా వచ్చాడు.. ప్రాణాలకు తెగించి మహిళను కాపాడిన డెలివరీ బాయ్.. వీడియో చూడండి.. | Delivery Driver Jumps Off 40ft Bridge to Save Drowning Woman in China, Watch Viral Video


మనకు సినిమాల్లో సూపర్ హీరోలు రెక్కలు కట్టుకుని వచ్చి కాపాడటం తెలుసు.. కానీ రియల్ లైఫ్‌లో డెలివరీ బాక్స్ వెనకేసుకుని, సాధారణ బైక్ మీద వచ్చే వాళ్లు కూడా కొందరికి దేవుళ్లతో సమానంగా మారుతుంటారు. తాజాగా సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న ఒక వీడియో చూస్తే ఈ మాట నిజమే అనిపిస్తుంది. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఒక వ్యక్తి చేసిన సాహసం, అతని దయాగుణం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది హృదయాలను గెలుచుకుంటుంది. తూర్పు చైనాకు చెందిన 31 ఏళ్ల పెంగ్ క్వింగ్లిన్ రోజువారీలాగే తన కస్టమర్‌కు ఆర్డర్ డెలివరీ చేయడానికి బైక్‌పై వెళ్తున్నాడు. మార్గమధ్యంలో కియాంటాంగ్ నది వద్దకు రాగానే వంతెనపై జనాల సందడి కనిపించింది. ఏంటా అని చూస్తే… ఉధృతంగా ప్రవహిస్తున్న ఆ నదిలో ఒక మహిళ కొట్టుకుపోతూ, బ్రతుకడానికి ప్రాణపోరాటం చేస్తోంది. ఏమాత్రం ఆలోచించలేదు.. చేతిలో ఉన్న డెలివరీ ఆర్డర్‌ను పక్కనపెట్టాడు. పక్కనే ఉన్న 40 అడుగుల ఎత్తైన వంతెన రెయిలింగ్ ఎక్కేసి, క్షణాల్లో ఆ ఉఫుకుతున్న నదిలోకి దూకేశాడు. ఈదుకుంటూ వెళ్లి ఆ మహిళను చేరుకుని, సురక్షితంగా ఒడ్డున ఉన్న మెట్ల దగ్గరకు తీసుకువచ్చాడు. వెంటనే స్పందించిన రెస్క్యూ టీమ్, పోలీసులు వారిద్దరినీ సురక్షితంగా బయటకు తీశారు.

సాహసానికి తగ్గ బంపర్ ఆఫర్లు

ఈ సంఘటనతో పెంగ్ రాత్రికి రాత్రే గ్లోబల్ స్టార్ అయ్యాడు. అతని సాహసానికి ప్రశంసలతో పాటు బహుమతులు వెల్లువెత్తాయి. పెంగ్‌కు మంచి మనసున్న వ్యక్తి బిరుదు ఇచ్చి 30,000 యువాన్లు రివార్డు ప్రకటించింది. పెంగ్ పనిచేస్తున్న కంపెనీ అతనికి 50,000 యువాన్లు నజరానా ఇవ్వడమే కాకుండా, అతని భవిష్యత్తు కోసం ఉచితంగా కాలేజీ చదువుకునే గొప్ప అవకాశాన్ని కల్పించింది.

రియల్ హీరో చెల్లించిన పెద్ద మూల్యం

ఈ విజువల్స్ కెమెరాలో రికార్డ్ అవ్వగా.. goodnews_movement అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు ఈ వీడియోను 48 లక్షలకు పైగా వీక్షించగా, 2.5 లక్షల మందికి పైగా లైక్ చేశారు. అయితే ఈ ప్రాణత్యాగానికి పెంగ్ కాస్త మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. 40 అడుగుల ఎత్తు నుంచి నీటిలోకి దూకడం వల్ల అతని వెన్నుముకలో స్పైనల్ ఫ్రాక్చర్ అయింది. అదృష్టవశాత్తూ ఎటువంటి సర్జరీ అవసరం లేకుండానే అతను కోలుకుంటాడని వైద్యులు తెలిపారు.

వీడియో చూడండి..



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *