Headlines

OTT Movie: ప్రశాంతమైన ఊరిలో దారుణ హత్యలు.. తెలుగులో ఓటీటీలోకి వచ్చేసిన కన్నడ సెన్సేషనల్ క్రైమ్ థ్రిల్లర్ | Kannada Crime Thriller Second Case Of Seetharam Movie Is Now Streaming In Telugu On Amazon Prime Video OTT

OTT Movie: ప్రశాంతమైన ఊరిలో దారుణ హత్యలు.. తెలుగులో ఓటీటీలోకి వచ్చేసిన కన్నడ సెన్సేషనల్ క్రైమ్ థ్రిల్లర్ | Kannada Crime Thriller Second Case Of Seetharam Movie Is Now Streaming In Telugu On Amazon Prime Video OTT


ఈ వారం ఓటీటీల్లోకి పలు సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. దీవానా, రావు బహదూర్, గట్టా కుస్తీ 2, చిన్న చిన్న ఆశై, బాలన్ ద బాయ్, లవ్ ఓ లవ్, పోలీస్ కంప్లైంట్ వంటి సినిమాలతో పాటు అబ్జెషన్ మై లార్డ్, హార్ట్ బీట్ సీజన్ 3 లాంటి వెబ్ సిరీస్ లు కూడా ఓటీటీ ఆడియెన్స్ కు వినోదం పంచుతున్నాయి. అయితే వీటితో పాటు ఓ కన్నడ సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ తెలుగు వెర్షన్ సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో ఈ సినిమా థియేటర్లలో విడుదలై సూపర్ హిట్గా నిలిచింది. ఆడియెన్స్ కు మంచి థ్రిల్లింగ్ ఎక్స్ పీరియెన్స్ ఇచ్చింది. ఆద్యంతం ఆసక్తికరంగా, ఊహించని ట్విస్టులతో సాగే ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లే వచ్చాయి. ఐఎమ్ డీబీలోనూ ఈ కన్నడ క్రైమ్ థ్రిల్లర్ కు టాప్ రేటింగ్ దక్కడం విశేషం. థియేటర్లలో సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా కొద్ది రోజుల క్రితమే ఓటీటీలోకి వచ్చింది. అయితే కేవలం కన్నడ, తమిళ వెర్షన్లు మాత్రమే స్ట్రీమింగ్ కు వచ్చాయ. ఇప్పుడీ సెన్సేషనల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. అనెగడ్డ అనే ఊరి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంది. ప్రశాంతంగా ఉండే ఈ గ్రామంలో వరుసగా దారుణ హత్యలు తీవ్ర కలకలం రేపుతాయి. ఓ సైకో కిల్లర్ మెడకు, చేతులకు గొలుసులు కట్టి గ్రామస్తులను అతి దారుణంగా చంపేస్తుంటారు. దీంతో ఊరి ప్రజలు బయటకు వెళ్లాలంటేనే వణికిపోతుంటారు. ఈ సీరియల్ మర్డర్స్ ను ఛేదించడానికి సీతారాం అనే ఒక పవర్ ఫుల్ ఆఫీసర్ రంగంలోకి దిగుతాడు. మరి ఈ బ్రూటల్ మర్డర్స్ వెనుక ఎవరున్నారు?అసలు ప్రశాంతమైన గ్రామంలో అలజడి రేగడానికి కారణమెవరు? సైకో కిల్లర్‌ ఉద్దేశమేంటి? అతనిని సీతారాం ఎలా పట్టుకున్నాడు? అన్న ప్రశ్నలకు అనేది తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే.


ఇవి కూడా చదవండి



ప్రస్తుతం ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా పేరు ‘సెకండ్ కేస్ ఆఫ్ సీతారాం’. గతంలో వచ్చిన సూపర్ హిట్ సినిమా సీతారాం బెనోయ్ కేస్ నెం.18 మూవీకి ఇది సీక్వెల్‌గా తెరకెక్కింది. దేవి ప్రసాద్ శెట్టి తెరకెక్కించిన ఈ సినిమాలో విజయ రాఘవేంద్ర హీరో గా నటించాడు. గోపాల్ దేశ్ పాండే, ఉష భండారి తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఫ్లైయింగ్ ఎలిఫెంట్ స్టోరీ టెలర్స్ బ్యానర్‌పై దేవి ప్రసాద్, సాత్విక్ హెబ్బర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ప్రస్తుతం ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ తో పాటు లయన్స్ గేట్ ప్లే ఓటీటీల్లో అందుబాటులో ఉంది. క్రైమ్ థ్రిల్లర్స్‌లో టాప్ ట్రెండింగ్‌లో నిలిచిన ఈ మూవీ ఇప్పుడు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వీకెండ్ లో మంచి క్రైమ్ థ్రిల్లర్ సినిమా చూడాలనుకునేవారికి ‘సెకండ్ కేస్ ఆఫ్ సీతారాం’ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

అమెజాన్ ప్రైమ్ లో సెకెండ్ కేస్ ఆఫ్ సీతారం..

సెకెండ్ కేస్ ఆఫ్ సీతారం ట్రైలర్..



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *