Headlines

Tollywood: ఈ అమ్మాయి ఇప్పుడు టాలీవుడ్ ఫేమస్ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా? మూడు సినిమాలతోనే 1600 కోట్లు | Guess The Tollywood Famous Actress In This Throwback Photo, She Is Aadarsha Kutumbam Movie Heroine Srinidhi Shetty

Tollywood: ఈ అమ్మాయి ఇప్పుడు టాలీవుడ్ ఫేమస్ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా? మూడు సినిమాలతోనే 1600 కోట్లు | Guess The Tollywood Famous Actress In This Throwback Photo, She Is Aadarsha Kutumbam Movie Heroine Srinidhi Shetty


పై ఫొటోలో ఎన్‌సీసీ డ్రెస్‌లో క్యూట్ గా కనిపిస్తోన్న ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ఈ క్యూటీ ఇప్పుడు టాలీవుడ్ లో ఫేమస్ హీరోయిన్. పేరుకు కన్నడ బ్యూటీనే అయినా తెలుగులోనే ఈ ముద్దుగుమ్మ ఎక్కువగా సినిమాలు చేస్తోంది. అన్నట్లు ఈ ముద్దుగుమ్మ చేసిన సినిమాలన్నీ దాదాపు సూపర్ హిట్టే. ఇప్పటివరకు ఈ హీరోయిన్ ఐదు సినిమాలు చేసింది. అందులో ఏకంగా 4 సినిమాలు 100 కోట్లకు పైగా కలెక్ట్ చేశాయి. కేవలం ఒకే ఒక్క సినిమా మాత్రమే యావరేజ్ గా ఆడింది. అన్నట్లు ఈ సొగసరి మొదట నటి అవ్వాలనుకోలేదు. చిన్నతనం నుంచే డ్యాన్స్, వాలీబాల్, త్రో బాల్, స్విమ్మింగ్ లో నైపుణ్యం సాధించింది. చదువులోనూ టాపర్. పదో తరగతిలో 94 శాతం మార్కులు,అలాగే బీటెక్ లో ఏకంగా 85 శాతం మార్కులతో డిస్టింక్షన్ సాధించింది. చదువు పూర్తయిన తర్వాత ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీ యాక్సెంచర్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా చేరింది. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే నటనపై ఆసక్తితో మోడలింగ్ లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత హీరోయిన్ గానూ ఎంట్రీ ఇచ్చింది. ఈమె హీరోయిన్ గా నటించిన మొదటి సినిమానే ఏకంగా 250 కోట్లు రాబట్టింది. ఇక రెండో సినిమా అయితే ఏకంగా రూ.1250 కోట్లు రాబట్టి బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టేసింది. టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్ గా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ మరెవరో కాదు కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి.

కేజీఎఫ్, కేజీఎఫ్ 2, నాని హిట్-3.. సినిమాలతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది శ్రీనిధి శెట్టి. మధ్యలో ఆమె చేసిన కోబ్రా, తెలుసుకదా సినిమాలు మాత్రమే యావరేజ్ గా ఆడాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కుతోన్న ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ – 47’ లో హీరోయిన్ గా నటిస్తోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో ఆమె ‘స్వర్ణ’ అనే పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన గ్లింప్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో నారా రోహిత్, నివేతా పేతురాజ్, రావు రమేష్, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. దసరా కానుకగా అక్టోబర్ 02న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి



చిన్నప్పుడు శ్రీనిధి శెట్టి..

ఆదర్శ కుటుంబం సినిమాలో శ్రీనిధి శెట్టి..



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *