Headlines

ఇక.. జ్ఞాపకంగా మిగలనున్న విశాఖ ఎయిర్‌పోర్ట్ అర్ధరాత్రి నుంచే సేవలు బంద్ | Visakhapatnam Airport to Halt Civilian Services as Bhogapuram Airport Commences Operations – Viral Videos in Telugu

ఇక.. జ్ఞాపకంగా మిగలనున్న విశాఖ ఎయిర్‌పోర్ట్ అర్ధరాత్రి నుంచే సేవలు బంద్ | Visakhapatnam Airport to Halt Civilian Services as Bhogapuram Airport Commences Operations – Viral Videos in Telugu


దాదాపు ఐదారు దశాబ్దాల చరిత్ర కలిగిన విశాఖ విమానాశ్రయం సాధారణ పౌర విమాన సేవలను నిలిపివేయనుంది. ఆగస్టు 16 అర్ధరాత్రి నుంచి విశాఖ ఎయిర్‌పోర్ట్ మూతపడనుంది. చివరి పౌర విమానం ఆ రోజు అర్ధరాత్రి ఎగరటంతో, ఈ చారిత్రాత్మకమైన ఎయిర్‌పోర్ట్ చరిత్ర పుటల్లో కలవనుంది. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఈ మార్పు అనివార్యం.ఆగస్టు 1న భోగాపురం ఎయిర్‌పోర్టును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేస్తారు. ఆ తర్వాత మంచి ముహూర్తం చూసుకుని శ్రావణ మాసంలో ఆగస్టు 17 నుంచి భోగాపురంలో విమానయాన కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. ఆగస్టు 17న రాత్రి 12 గంటల ఒక నిమిషం నుంచి దాదాపు 30 సంవత్సరాల పాటు విశాఖ ఎయిర్‌పోర్ట్ నుంచి షెడ్యూల్డ్ కమర్షియల్ విమానాల రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తున్నట్టు కేంద్రం గెజిట్ విడుదల చేసింది. విశాఖకు సొంతమైన వీటీజెడ్ కోడ్ కూడా భోగాపురం ఎయిర్‌పోర్టుకే బదిలీ అవుతుంది.అయితే, పాత విశాఖ ఎయిర్‌పోర్ట్ పూర్తిగా మూతపడదు. వీఐపీ, అత్యవసర సేవలు, జాతీయ అత్యవసర పరిస్థితులు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, నేవీ, డిఫెన్స్ ఫోర్సెస్, పోలీస్ విమానాలు, ప్రైవేట్ జెట్‌లు, లీజ్డ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఇక్కడి నుంచే ఆపరేట్ అవుతాయి.

మరిన్ని వీడియోల కోసం :

టాక్సిక్‌ క్రేజ్‌… ఫస్ట్ ఈవెంటే నెక్స్ట్ లెవల్‌!

ఈ వారం థియేటర్లలో సందడి చేయనున్న సినిమాలు ఇవే

పెళ్లిచూపులకు పదేళ్లు..తనని తాను స్టార్‌గా మలుచుకున్న రౌడీ భాయ్‌

లీస్ట్ బడ్జెట్‌.. రికార్డ్ టైమ్‌..సందీప్‌ స్కెచ్‌..ప్రభాస్‌కు సెట్ అవుతుందా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *