Headlines

వింత రెస్టారెంట్.. హోటల్ లోపల 26 సమాధులు | Ahmedabad’s Unique Restaurant Where Customers Dine Among 26 Tombs video tv9d – Viral Videos in Telugu

వింత రెస్టారెంట్.. హోటల్ లోపల 26 సమాధులు | Ahmedabad’s Unique Restaurant Where Customers Dine Among 26 Tombs video tv9d – Viral Videos in Telugu


అహ్మదాబాద్‌లోని లాల్ దర్వాజా ప్రాంతంలో ఉన్న ‘న్యూ లక్కీ రెస్టారెంట్’ అత్యంత విలక్షణమైన ప్రదేశంగా పేరుపొందింది. బయటకు సాధారణ హోటల్‌లా కనిపించినా, లోపల కస్టమర్లు కూర్చునే టేబుళ్ల మధ్య ఏకంగా 26 సమాధులు ఉంటాయి. గత 75 ఏళ్లుగా నడుస్తున్న ఈ రెస్టారెంట్‌కు వచ్చే కస్టమర్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందే తప్ప ఏమాత్రం తగ్గలేదు. సుమారు 75 ఏళ్ల క్రితం కృష్ణన్ కుట్టీ అనే వ్యక్తి హోటల్ నిర్మాణం చేపట్టినప్పుడు ఇక్కడ 16వ శతాబ్దానికి చెందిన సూఫీ సాధువుల సమాధులు బయటపడ్డాయి. వాటిని తొలగించడం ఇష్టంలేక, గ్రిల్స్ ఏర్పాటు చేసి వాటి మధ్యలోనే టేబుళ్లు వేసి వ్యాపారం ప్రారంభించారు. నిర్వాహకులు ప్రతిరోజూ ఈ సమాధులను శుభ్రం చేసి, పూలు ఉంచి ప్రార్థనలు నిర్వహిస్తారు. ఇక్కడి మసాలా చాయ్, బన్ మస్కా ఎంతో ప్రసిద్ధి చెందాయి. ఏదైనా ముఖ్యమైన పనిమీద వెళ్లేముందు ఇక్కడ టీ తాగి వెళితే అదృష్టం కలిసి వస్తుందని స్థానికులు నమ్ముతారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వంటి ప్రముఖులు ఈ రెస్టారెంట్‌ను సందర్శించడమే కాక, ఓ ప్రముఖ షోలోనూ దీనిని చూపించారు. చారిత్రక సమాధులను గౌరవిస్తూ నిర్వహిస్తున్న ఈ హోటల్ అహ్మదాబాద్‌లోనే ఒక విచిత్రమైన పర్యాటక కేంద్రంగా నిలిచింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మధ్యాహ్నం వేళ నీరసంగా అనిపిస్తోందా.. ఇదిగో సరికొత్త ట్రిక్ ‘కాఫీ నాప్’

ఇతను బస్సు డ్రైవరా.. కుబేరుడా!

మీ అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్‌ సురక్షితమేనా.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!

ఉదయాన్నే టీ తాగుతున్నారా? ఇది తెలిస్తే ఇక టీ జోలికి వెళ్లరు

అరే.. ఇదేం చేప.. ప్లేస్‌ను బట్టి రంగు మార్చేస్తోంది!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *