Headlines

ఆగస్టులో బాక్సాఫీస్ సమరం.. భారీ సినిమాల దూకుడా.. చిన్న చిత్రాల సర్‌ప్రైజా? | August Box Office Battle: Big Releases and Small Films Aim to Keep Theatres Buzzing video – Entertainment Videos in Telugu

ఆగస్టులో బాక్సాఫీస్ సమరం.. భారీ సినిమాల దూకుడా.. చిన్న చిత్రాల సర్‌ప్రైజా? | August Box Office Battle: Big Releases and Small Films Aim to Keep Theatres Buzzing video – Entertainment Videos in Telugu


ఆడియన్స్ థియేటర్లకు రావడం లేదన్న వాదనలకు రీసెంట్ సినిమాలు బ్రేక్ వేశాయి. చాలా రోజుల తర్వాత ప్రేక్షకులు థియేటర్ల వైపు క్యూ కడుతూ ఫుట్‌ఫాల్స్ పెంచుతున్నారు. ఈ జోరును కంటిన్యూ చేయాల్సిన బాధ్యత ఇప్పుడు ఆగస్టు సినిమాలపైన పడింది. అప్ కమింగ్ లిస్ట్‌లో క్రేజీ ప్రాజెక్ట్స్‌తో పాటు కొన్ని చిన్న సినిమాలు కూడా ఊరిస్తున్నాయి. మరి ఆ ప్రాజెక్ట్స్‌ వెండితెర మీద మ్యాజిక్‌ను కంటిన్యూ చేస్తాయా? థియేటర్లకు వచ్చే ఆడియన్స్ సంఖ్య తగ్గిపోయిందనే టెన్షన్‌కు రీసెంట్ హిట్స్ చెక్ పెట్టాయి. కంటెంట్ ఉన్న బొమ్మ పడితే జనాలు థియేటర్లకు పరుగులు పెడతారని మరోసారి ప్రూవ్ అయ్యింది. దీంతో బాక్సాఫీస్ దగ్గర మళ్లీ పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఇప్పుడు ఈ జోష్‌ని ఎక్కడా తగ్గకుండా కంటిన్యూ చేయాల్సిన బాధ్యత ఆగస్టులో రిలీజ్ కాబోతున్న సినిమాల మీద పడింది. ఆగస్టు నెలలో బాక్సాఫీస్ రికార్డులను టార్గెట్ చేస్తూ క్రేజీ మూవీస్ రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. భారీ అంచనాలతో వస్తున్న ‘కొరియన్ కనకరాజు’, డిఫరెంట్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్‌’, యాక్షన్ డ్రామాగా వస్తున్న ‘టాక్సిక్’, మలయాళ మూవీ ‘ఐయామ్ గేమ్‌’ లాంటి క్రేజీ సినిమాలు రిలీజ్‌కు క్యూ కట్టాయి. ఈ బడా సినిమాలు తమ రేంజ్‌కు తగ్గట్టుగా బాక్సాఫీస్ దగ్గర హిట్ టాక్ తెచ్చుకుంటే.. కలెక్షన్ల సునామీ సృష్టించడం పక్కా. ఈ లిస్ట్‌లో మోస్ట్ అవెయిటెడ్ టాక్సిక్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఆడియన్స్‌కు ఏమాత్రం కనెక్ట్ అయినా.. ఇండస్ట్రీ రికార్డులు తిరగరాయటం ఖాయం అన్న టాక్ వినిపిస్తోంది. హిట్‌ ఫార్ములా హారర్‌ కామెడీ జానర్‌లో రూపొందుతున్న కొరియన్ కనకరాజు, హీరో వరుణ్ తేజ్‌ కెరీర్‌కు కూడా కీలకంగా మారింది. డబ్బింగ్ సినిమాలే అయినా విశ్వనాథ్ అండ్ సన్స్‌, ఐయామ్ గేమ్ మీద కూడా టాలీవుడ్ మంచి క్రేజ్‌ ఉంది.భారీ చిత్రాలు మాత్రమే కాదు, మంచి కంటెంట్‌ను నమ్ముకుని వస్తున్న చిన్న సినిమాలు కూడా బాక్సాఫీస్ బరిలో సక్సెస్ కొట్టాల్సిన పరిస్థితి ఉంది. పళ్లబురుసు, అగధ, అనకాపల్లి లాంటి చిన్న సినిమాలు కూడా ఈ ఆగస్టులోనే ఆడియన్స్‌ను మెప్పించడానికి వస్తున్నాయి. పెద్ద సినిమాలతో పాటు ఈ చిన్న సినిమాలు కూడా హిట్టైతేనే బాక్సాఫీస్ దగ్గర ఈ జోరు కంటిన్యూ అవుతుంది. మరి ఆగస్టు బాక్సాఫీస్ బరిలో నిలబడేదెవరో, బ్లాక్ బస్టర్స్ కొట్టేదెవరో చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Burj Khalifa: గుడ్‌న్యూస్.. యూపీఐతో బుర్జ్ ఖలీఫా టికెట్లు

వింత రెస్టారెంట్.. హోటల్ లోపల 26 సమాధులు

మధ్యాహ్నం వేళ నీరసంగా అనిపిస్తోందా.. ఇదిగో సరికొత్త ట్రిక్ ‘కాఫీ నాప్’

ఇతను బస్సు డ్రైవరా.. కుబేరుడా!

మీ అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్‌ సురక్షితమేనా.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *