Headlines

Team India: 26 ఏళ్లకే కోట్లకు పడగలెత్తిన టీమిండియా ప్రిన్స్.. ఏడాదికి ఎంత సంపాదిస్తాడో తెలుసా? | Shubman gill net worth salary ipl price luxury lifestyle cars

Team India: 26 ఏళ్లకే కోట్లకు పడగలెత్తిన టీమిండియా ప్రిన్స్.. ఏడాదికి ఎంత సంపాదిస్తాడో తెలుసా? | Shubman gill net worth salary ipl price luxury lifestyle cars


Indian Cricketer Lifestyle: భారత టెస్టు జట్టు కెప్టెన్, యంగ్ సెన్సేషన్ శుభ్‌మన్ గిల్ కేవలం మైదానంలో పరుగుల వరద పారించడమే కాదు.. ఆస్తుల వేటలోనూ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. చిన్న వయసులోనే కోట్ల రూపాయల ఆదాయంతో అత్యంత ఖరీదైన లైఫ్‌స్టైల్‌ను అనుభవిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. గిల్ వార్షిక ఆదాయం, లగ్జరీ కార్లు, ఆస్తుల వివరాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

టీమిండియా 3 ఫార్మాట్లలోనూ అత్యంత కీలక ఆటగాడిగా మారిన శుభ్‌మన్ గిల్ సంపాదన గత కొన్ని ఏళ్లలో ఊహించని రీతిలో పెరిగింది. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో గ్రేడ్-ఎ విభాగంలో స్థానం సంపాదించిన గిల్‌కు ఏడాదికి రూ.5 కోట్ల కాంట్రాక్ట్ లభిస్తోంది. మ్యాచ్ ఫీజులతో కలిపితే కేవలం క్రికెట్ బోర్డు నుంచే రూ.6 నుంచి 7 కోట్ల వరకు లభిస్తుండటం విశేషం.

ఇది కూడా చదవండి:132 ఫోర్లు, 168 సిక్స్‌లతో 1670 పరుగులు.. క్రిస్ గేల్‌కే మెంటలెక్కించేలా వైభవ్ విధ్వంసం..

ఇవి కూడా చదవండి



ఐపీఎల్ జీతంతో పాటు విపరీతమైన బ్రాండ్ వ్యాల్యూ..

ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్న గిల్ ప్రతి సీజన్‌కు రూ.16.5 కోట్ల భారీ పారితోషికం అందుకుంటున్నాడు. సీయట్, జిల్లెట్, టాటా క్యాపిటల్, పూమా, బోట్, మై11సర్కిల్ లాంటి దిగ్గజ బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ కోట్లు గడిస్తున్నాడు. అన్ని మార్గాల ద్వారా కలిపి గిల్ ఏడాది సంపాదన రూ.30 నుంచి 40 కోట్లకు చేరుకుందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

ముంబైలో సీ-ఫేసింగ్ ప్లాట్.. పంజాబ్‌లో ప్యాలెస్..

సంపాదన పెరిగేకొద్దీ గిల్ తన రియల్ ఎస్టేట్ ఆస్తుల విలువను కూడా భారీగా పెంచుకున్నాడు. పంజాబ్‌లోని మోహాలీ-చండీగఢ్ ప్రాంతంలో అతడికి అత్యంత విలాసవంతమైన ఫ్యామిలీ హోమ్ ఉంది. దాంతో పాటు ముంబైలోని అత్యంత ఖరీదైన జూహు ప్రాంతంలో సుమారు రూ.20.7 కోట్ల విలువైన సీ-ఫేసింగ్ లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను కూడా గిల్ ఇటీవల సొంతం చేసుకున్నాడు.

ఇది కూడా చదవండి: IND vs SL: శ్రీలంకతో ఫైనల్ ఛాన్స్ రా భయ్.. ఫెయిలైతే టీమిండియాలో నీ కెరీర్ క్లోజ్..!

గ్యారేజీలో గర్వంగా నిలిచే లగ్జరీ కార్లు..

క్రికెటర్లలో వేగానికి, స్టైల్‌కు మారుపేరైన గిల్‌కు ఖరీదైన కార్లంటే చాలా ఇష్టం. అతడి గ్యారేజీలో రూ.89 లక్షల విలువైన రేంజ్ రోవర్ వేలార్, మెర్సిడెస్ బెంచ్ ఈ-క్లాస్ మోడల్స్ ఉన్నాయి. ఆస్ట్రేలియా గబ్బా టెస్టులో చారిత్రాత్మక విజయం తర్వాత వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా గిల్‌కు మహీంద్రా థార్ వాహనాన్ని కానుకగా ఇచ్చారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *