Headlines

Bhaja Govindam Song: చిన్న జీయర్ స్వామి చేతుల మీదుగా రిలీజైన ‘భజగోవిందం’ సాంగ్.. ‘ఆలోచన’ సినిమా రిలీజ్ ఎప్పుడంటే? | Chinna Jeeyar Swamy Launches Bhaja Govindam Song From Concept Based Movie Aalochana

Bhaja Govindam Song: చిన్న జీయర్ స్వామి చేతుల మీదుగా రిలీజైన ‘భజగోవిందం’ సాంగ్.. ‘ఆలోచన’ సినిమా రిలీజ్ ఎప్పుడంటే? | Chinna Jeeyar Swamy Launches Bhaja Govindam Song From Concept Based Movie Aalochana


పి.ఎస్.జె ఫిలిమ్స్ కో బ్యానర్ లో ప్రదీప్ కుమార్, శ్రీనివాస్ గుండబోయిన నిర్మించిన చిత్రం “ఆలోచన”. సీనియర్ నటులు జి.వి.నారాయణ రావు, ప్రసాద్ బాబు, నరసింహరాజు, రాజన్ హరి , మహర్షి రాఘవ, జయలలిత, బెన్నీ సుధాకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సురేందర్ చాచా కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం వహించారు. ఇటీవల ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను మురళి మోహన్ విడుదల చేశారు, అలాగే టీజర్ ను ప్రముఖ రచయిత విజయేoద్ర ప్రసాద్ విడుదల చేశారు. తాజాగా ఆలోచన సినిమా నుంచి ‘భజగోవిందం‘ పాటను చిన్న జీయర్ స్వామి విడుదల చేశారు. స్నేహితుల రోజు సందర్బంగా ఈ పాట విడుదల అవ్వడం విశేషం. వృద్ధాప్యంలో కూడా స్నేహితులు ప్రతిరోజు కలుస్తూ ఉంటే ఒంటరితనం ఎవరి దగ్గరికి రాదు.స్నేహం విలువలు, వాటి అవసరాలు ఎంతో చెప్పి ఆలోచింపచేసే చిత్రమే “ఆలోచన”…. ఆది గురువు శంకరాచార్యులు రచించిన భక్తి కావ్యం “మోహ ముద్గర” నుంచిసంస్కృత శ్లోకాల లోని తత్వం, వేదాంతము జీవన సారం సామాన్యులకు కూడా అర్థమయ్యేలా తెలుగు భాష లో అనువదించి అందిస్తున్నారు.

ఇలా అందించాలన్న ‘ఆలోచన’ దర్శకుడు సురేందర్ చాచా చేయగా… ప్రదీప్ కుమార్ , శ్రీనివాస్ గుండబోయిన నిర్మాణం చేశారు. రచయిత ప్రతాప్ రాజుల పల్లి ఈ పాటను అనువదించారు. వియాన్ .ఎస్ .ఏ ఈ పాటకు సంగీతం వహించగా, మంగ్లీ వియాన్ ఆలపించారు. ఈ చిత్రానికి సాంకేతిక వర్గం కెమెరా: టి. సురేంద్ర రెడ్డి, సంగీతం: వియాన్ , పాటలు: ప్రతాప్ రాజులపల్లి, ఎడిటర్: ఆర్.ఎల్.వర్మ, ఆర్ట్: గిరీష్ దేవాంగ్, ఈ.పి: సీ.హెచ్.విజయ్ కుమార్. మంచి కథాబలం ఉన్న “ఆలోచన” సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇవి కూడా చదవండి



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *