Headlines

Horoscope Today: ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. సోమవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే.. | Daily Horoscope August 3, 2026: Aries to Pisces Astrology Predictions, Career, Money and Family Rasi Phalalu

Horoscope Today: ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. సోమవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే.. | Daily Horoscope August 3, 2026: Aries to Pisces Astrology Predictions, Career, Money and Family Rasi Phalalu


దిన ఫలాలు – ఆగస్టు 3, 2026: మేషం రాశి వారికి ఉద్యోగంలో అధికారుల ఆదరణ లభిస్తుంది. హోదా పెరిగే అవకాశం ఉంది. వృషభం రాశి వారి ఉద్యోగంలో బాధ్యతలు, కార్యకలాపాలు బాగా ఎక్కువగా ఉంటాయి. మిథునం రాశి వారికి వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగిపోతాయి. వృత్తి జీవితంలో సరికొత్త గుర్తింపు లభించి డిమాండ్ పెరుగుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారం నాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

  1. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఉద్యోగంలో అధికారుల ఆదరణ లభిస్తుంది. హోదా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు, పెండింగ్ పనులు కొద్దిపాటి శ్రమతో పూర్తవుతాయి. మిత్రుల నుంచి కొద్దిపాటి ఇబ్బందులుంటాయి. కుటుంబ సభ్యుల నుంచి ఆర్థికంగా ఒత్తిడి పెరుగుతుంది. ఆలయాలను సందర్శిస్తారు. కొందరు మిత్రులతో విహార యాత్రలో పాల్గొనే అవకాశం ఉంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన సానుకూల స్పందన లభిస్తుంది.
  2. వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఉద్యోగంలో బాధ్యతలు, కార్యకలాపాలు బాగా ఎక్కువగా ఉంటాయి. వృత్తి జీవితం బిజీగా సాగుతుంది. ఇంటా బయటా బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. కొద్దిగా మానసిక ఒత్తిడి ఉండవచ్చు. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, వృథా ఖర్చులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. వ్యాపారాల్లో అనేక విధాలుగా అనుకూలతలు పెరుగుతాయి. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగుతుంది.
  3. మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగిపోతాయి. వృత్తి జీవితంలో సరికొత్త గుర్తింపు లభించి డిమాండ్ పెరుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. వాహన యోగం కలుగుతుంది. ఉద్యోగపరంగా విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. పిల్లల ద్వారా కొన్ని శుభవార్తలు వింటారు.
  4. కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఉద్యోగంలో మీ ఆలోచనలు, అభిప్రాయాలకు అధికారుల ఆదరణ లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. కుటుంబ బాధ్యతలు ఇబ్బంది పెడతాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఒకటి రెండు అదనపు ఆదాయ మార్గాల నుంచి ఆశించిన ఫలితాలు అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రమాధిక్యత, వ్యయప్రయాసలు తప్పకపోవచ్చు. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆశించిన శుభవార్తలు వింటారు.
  5. సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): వృత్తి, ఉద్యోగాల్లో చిన్నా చితకా సమస్యల్ని పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల విషయంలో సానుకూల సమాచారం అందుకుంటారు. బంధువుల నుంచి ఆశించిన శుభవార్తలు అందుతాయి. డాక్టర్లు, లాయర్లు, రియల్ ఎస్టేట్ రంగం వారికి ఇబ్బ డిముబ్బడిగా ఆదాయం పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రులకు మేలు జరిగే పనులు చేస్తారు.
  6. కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యయ ప్రయాసలతో కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. రావలసిన డబ్బు అందుతుంది. మొండి బాకీ ఒకటి వసూలవుతుంది. కుటుంబంలో మాట పట్టింపులు తలెత్తే అవకాశముంది. ఆచితూచి వ్యవహరించడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో లాభాలకు లోటుండదు. వ్యాపారాల్లో చిన్నా చితకా ఆర్థిక సమస్యలు పరిష్కార మవుతాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఎటువంటి వాగ్దానాలూ చేయకపోవడం మంచిది.
  7. తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఉద్యోగంలో అధికారులతో అనుకూలతలు పెరుగుతాయి. కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తులవారి రాబడి బాగా పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. నిరుద్యోగులకు విదేశీ కంపెనీల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. బంధు వుల నుంచి కొన్ని శుభవార్తలు వింటారు. పెండింగ్ పనులన్నీ కొద్దిపాటి వ్యయప్రయాసలతో సకాలంలో పూర్తవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.
  8. వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ఉద్యోగంలో అధికారులు ఎక్కువగా ఆధారపడతారు. బాధ్యతల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పులు చేపట్టి లబ్ధి పొందుతారు. వ్యాపారాల్లో పెట్టుబడులు పెంచే అవకాశం ఉంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు సాఫీగా పురోగమిస్తాయి. జీవిత భాగస్వామికి ఆకస్మిక ధన లాభం ఉంది. కుటుంబ జీవితం అనుకూలంగా సాగుతుంది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
  9. ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ఉద్యోగంలో అదనపు బాధ్యతలు తప్పకపోవచ్చు. అధికారులతో సామరస్యం పెరుగుతుంది. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను చక్కబెడతారు. అనుకో కుండా ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అదనపు ఆదాయ ప్రయ త్నాలు ఫలిస్తాయి. ఆర్థిక లావాదేవీల వల్ల ఆశించిన ప్రయోజనం ఉంటుంది. ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మిత్రులతో విభేదాలు తలెత్తుతాయి.
  10. మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): రోజంతా చాలావరకు సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు మీకు బాగా ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలకు తగ్గ ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. జీవిత భాగస్వామితో అన్యోన్యత బాగా పెరుగుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
  11. కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా, ప్రోత్సాహకరంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో ఒకటి రెండు శుభ వార్తలు వింటారు. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిచిపోతుంది. వ్యాపారాల్ని విస్తరించే ఆలోచన చేస్తారు. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. పెండింగ్ పనులను చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. జీవిత భాగస్వామి ఒకటి రెండు శుభవార్తలు వింటారు.
  12. మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఉద్యోగం సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి జీవితంలో బిజీ అవుతారు. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి. కుటుంబంలో అనుకోకుండా ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమయ్యే అవకాశం ఉంది. బంధువుల రాకపోకలుంటాయి. తలపెట్టిన పనులు సజావుగా పూర్తవుతాయి. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. ఆకస్మిక ధన లాభానికి అవకాశంఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *